మహబూబాబాద్ లో దారుణం..భర్త మర్మాంగం కోసి హత్య..!

భార్య భర్తల మధ్య వచ్చిన చిన్న చిన్న గొడవలు దారుణాలకు పాల్పడే వరకు వెళుతున్నాయి. భర్తలు వేధిస్తున్నారని భార్యలు…భార్యలు వేధిస్తున్నారని భర్తలు దారుణమైన నిర్ణయాలు తీసుకుని జీవితాన్ని విషాదం లో నింపుకుంటున్నారు. తాజాగా మహబూబా బాద్ లో దారుణం చోటు చేసుకుంది. ఓ భార్య తన భర్త మర్మాంగం కోసి హత్య చేసింది. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. వివరాల్లోకి వెళితే… మహబూబా బాద్ మరిపెడ మండలం తానం చెర్ల రెవెన్యూ పరిధిలోని వాంకుడోతు తండాలో ఈ ఘటన చోటు చేసుకుంది.

crime
crime

తన భర్త భూక్యా బిచ్యా తరచూ మద్యం సేవించి వేధింపులకు పాల్పడుతున్నాడు అని భార్య ప్రమీల ఏకంగా కోపం తో మర్మాంగం కోసి వేసింది. దాంతో భర్త మృతి చెందాడు. ఈ ఘటన పై సమాచారం అందడం తో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. నిందితురాలిని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ జరుపుతున్నారు.