కరోనా నేపథ్యంలో ప్రజల్లో తీవ్రమైన భయాందోళనలు నెలకొన్నాయి. ముఖ్యంగా కోవిడ్ లక్షణాలు కనిపించినప్పటి నుంచి టెస్టు చేయించుకుని పాజిటివ్ వచ్చాక ట్రీట్‌మెంట్ తీసుకునే వరకు, చికిత్స తీసుకునే సమయంలోనూ చాలా మంది ఆందోళన చెందుతున్నారు. కోవిడ్ లక్షణాలు ఉంటే కోవిడ్ వచ్చిందేమోనని భయపడడంతోపాటు అది వచ్చాక చికిత్స తీసుకుంటూ ఆక్సిజన్ లెవల్స్ పడిపోతాయేమోనని ఆందోళన చెందుతున్నారు.
అయితే అహ్మదాబాద్ మెడికల్ అసోసియేషన్ చెబుతున్న ప్రకారం.. ఆందోళన వల్ల శరీరంలో ఆక్సిజన్ స్థాయిలు ఇంకా పడిపోతాయి. ఎందుకంటే ఆందోళన చెందే సమయంలో మెదడు ఎక్కువ ఆక్సిజన్‌ను ఉపయోగించుకుంటుంది. దీంతో అలాంటి సమయంలో ఆక్సీమీటర్ పెట్టి కొలిస్తే సహజంగానే ఆక్సిజన్ లెవల్స్ తక్కువగా కనిపిస్తాయి. దీంతో మరింత ఆందోళన చెందుతారు. అది మరింత ఆక్సిజన్ స్థాయిలు పతనం అయ్యేందుకు కారణం అవుతుంది. ఫలితంగా ఐసీయూలకు పరుగులు తీస్తారు.
అయితే వైద్య నిపుణులు చెబుతున్న ప్రకారం కోవిడ్ చికిత్స తీసుకునే ఎవరైనా సరే ఆందోళన చెందకూడదు. ఆందోళన చెందితే ఆక్సిజన్ స్థాయిలు మరింతగా పడిపోతాయని గుర్తుంచుకోవాలి. దీంతో పరిస్థితి మరింత తీవ్రతరం అవుతుంది. కనుక ఒత్తిడి, ఆందోళన స్థాయిలను తగ్గించుకోవడంతోపాటు యోగా, మెడిటేషన్ వంటివి చేస్తే శరీరంలో ఆక్సిజన్ స్థాయిలను పెంచుకోవచ్చు.