వాట్సాప్ మరో కొత్త ఫీచర్‌ను పరీక్షిస్తోంది. యూజర్లకు డేటా ట్రాన్స్ ఫర్ చేసే విషయంలో ఎదురవుతున్న ఇబ్బందులను వాట్సాప్ తొలగించనుంది. ఆ ఫీచర్‌తో వాట్సాప్ డేటాను ఒక డివైజ్ నుంచి మరో డివైజ్‌కు సింక్ చేసే కొత్త ఫీచర్‌ను సంస్థ పరీక్షిస్తోందట.
కొత్త ప్రైవసీ పాలసీ, ఇతర నియమాలకు వినియోగదారులు యాక్సెప్టేషన్ గడువును సంస్థ ఇటీవల తొలగించిన విషయం తెలిసిందే. అయితే, దీనిపై తాజా వార్త మాత్రం వివాదానికి సంబంధించింది కాదు. ఆ సంస్థ వినియోగదారులను ఆకట్టుకోవడానికి మరో కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకురానుంది.యూజర్లకు డేటా ట్రాన్స్ ఫర్ విషయంలో ఎదురవుతున్న సమస్యలను వాట్సాప్ తొలగించనుంది. ఒక డివైజ్ నుంచి మరో డివైజ్‌కు వాట్సాప్ డేటాను సింక్ చేసే కొత్త ఫీచర్‌ను సంస్థ పరీక్షిస్తోంది. దీని ద్వారా ఆండ్రాయిడ్, ఐఓఎస్ డివైజ్‌ల మధ్య చాట్ లిస్టును మైగ్రేషన్ చేసుకోవచ్చు. ఈ అప్‌డేట్ తరువాత వినియోగదారులు తమ వాట్సాప్ చాట్‌లను ఆండ్రాయిడ్ డివైజ్ నుంచి ఐఓఎస్‌కు, అదేవిధంగా ఐఓఎస్ నుంచి ఆండ్రాయిడ్ డివైజ్‌లకు సులభంగా అప్‌లోడ్ చేసుకోవచ్చు.
ఈ వివరాలను WABetaInfo వెల్లడించింది. ‘సింకింగ్ విత్ వాట్సాప్ ఆన్ అనదర్ డివైజ్’ పేరుతో కొత్త ఫీచర్‌ను వాట్సాప్ పరీక్షిస్తోందని తెలిపింది. చాట్ పిన్ చేయడం లేదా స్టార్ ఇవ్వడం వంటి ఫీచర్లు రెండు డివైజ్‌లలో ఒకేసారి పని చేస్తాయి. అయితే మరికొన్ని ఫీచర్లు మాత్రం సింక్ అయిన డివైజ్‌లలో పనిచేయవని నివేదించింది. ఈ ఫీచర్ ఇంకా టెస్టింగ్ దశలోనే ఉన్నట్లు తెలుస్తోంది. పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసిన తరువాత ఫీచర్‌ను బీటా వెర్షన్స్ పరీక్షించనున్నారు. ఆ తరువాతే పనితీరు ఆధారంగా దీన్ని యూజర్లకు అందుబాటులోకి తీసుకురానున్నారు. ఈ క్రమంలో ఫీచర్‌లో కొన్ని మార్పులు చేసే అవకాశం కూడా ఉంది. అయితే ఈ కొత్త అప్‌డేట్‌పై స్పష్టమైన వివరణ లేదు. ఈ ఫీచర్‌కు సంబంధించిన వివరాలను వాట్సాప్ ఇంకా అధికారికంగా వెల్లడించలేదు.