ఫిబ్రవరి 1 సోమవారం: రాశి ఫలాలు మరియు పరిహారాలు

-

ఫిబ్రవరి – 1- పుష్య మాసం – సోమవారం.

 

మేష రాశి:వ్యాపారాలలో లాభాలు !

ఈరోజు శుభ యోగంగా ఉంటుంది. ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహిస్తారు. అనారోగ్యాన్ని తగ్గించుకుని ఆరోగ్యంగా ఉంటారు. గృహంలో ఒక శుభకార్యం తలపెడతారు. ఉన్నత వ్యక్తులతో పరిచయాలు ఏర్పరచుకుంటారు. విద్యార్థులు బాగా కష్టపడి చదువుకొని ఉత్తమ విద్యార్థులుగా పేరు పొందుతారు. వ్యాపారాలల్లో లాభాలు కలుగుతాయి. శత్రువులు కూడా మిత్రులు అవుతారు.

పరిహారాలు: ఈరోజు మణిద్వీప వర్ణన పారాయణం చేసుకోండి.

 

todays horoscope

వృషభ రాశి:ఈరోజు పనులు సరైన సమయంలో పూర్తి !

ఈరోజు బాగుంటుంది. విద్యార్థులు బాగా చదువుకొని పోటీ పరీక్షలలో విజయం పొందుతారు. తల్లిదండ్రుల సౌఖ్యాన్ని పొందుతారు. ప్రయాణాలు అనుకూలిస్తాయి. తీర్థయాత్రలు చేస్తారు. బంగారు ఆభరణాలు కొనుగోలు చేస్తారు. వివాహాది సంబంధ విషయాలు అనుకూలిస్తాయి. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం కలుగుతుంది. వ్యాపారాలను విస్తరించుకొని లాభాలు పొందుతారు. పట్టుదలతో చేపట్టిన పనులను సరైన సమయానికి పూర్తిచేస్తారు.

పరిహారాలు:  శ్రీ రామరక్షా స్తోత్రం పారాయణం చేసుకోండి.

 

మిధున రాశి:ఆభరణాలను కొనుగోలు చేస్తారు !

ఈరోజు అనుకూలంగా ఉంటుంది.మొండి బకాయిలను వసూలు చేసుకుంటారు. ధన లాభం కలుగుతుంది. వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టి అధిక లాభాలు పొందుతారు. అప్పుల బాధలు తీర్చుకుంటారు. సువర్ణ అభరణాలను కొనుగోలు చేస్తారు. నూతన గృహాన్ని కొనుగోలు చేస్తారు. ఉద్యోగస్తులు ఆఫీసులలో పై అధికారుల నుంచి కీర్తి పొందుతారు.

పరిహారాలు: ఈరోజు కనకధారా స్తోత్ర పారాయణం చేసుకోండి

 

కర్కాటక రాశి:ఈరోజు అందరినీ ఆకట్టుకుంటారు !

ఈరోజు బాగుంటుంది. మీ మాట తీరుతో అందరినీ ఆకట్టుకుంటారు. అప్పుల బాధలు తొలగిపోతాయి. అనారోగ్యాన్ని తగ్గించుకొని ఆరోగ్యంగా ఉంటారు. కుటుంబ సభ్యులందరితో, మిత్రులతో కలిసి మెలిసి సంతోషంగా గడుపుతారు. ప్రయాణ లాభాలు కలుగుతాయి. తీర్థయాత్రలు చేస్తారు. గృహ స్థలాలను కొనుగోలు చేస్తారు. వ్యాపారాలో అధిక లాభాలు కలుగుతాయి. గతంలో పోగొట్టుకున్న ఉద్యోగాన్ని తిరిగి పొందుతారు.

పరిహారాలు: శ్రీ వేంకటేశ్వర స్వామి ఆరాధన చేసుకోండి.

 

సింహరాశి:అప్పుల బాధలు తొలిగిపోతాయి !

ఈరోజు అనుకూలంగా ఉంటుంది. సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందుతారు. వివాహ నిశ్చయ తాంబూలాలకు అనుకూలమైన రోజు. బంగారు ఆభరణాలను కొనుగోలు చేస్తారు. ఇంతకు ముందు పోయిన ఉద్యోగాన్ని తిరిగే పొందుతారు. ఉద్యోగస్తులకు ఆఫీసుల్లో అనుకున్న స్థానాలకు బదిలీ అయ్యే అవకాశం ఉంది. సోదరులతో కలిసి మెలిసి సఖ్యతగా ఉంటారు.ఆపుల బాధలు తొలిగిపోతాయి.

పరిహారాలు: ఈరోజు లలితా అష్టోత్తర శత నామావళి స్తోత్రం పారాయణం చేసుకోండి.

 

కన్యారాశి:ఈరోజు అన్యోన్యంగా ఉంటారు !

ఈరోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. దంపతుల మధ్య విభేదాలు తగ్గిపోయి అన్యోన్యంగా ఉంటారు  విద్యార్థులు బాగా కష్టపడి చదువుకొని పోటీ పరీక్షలో ఉత్తీర్ణులు అవుతారు. అప్పుల బాధ నుంచి బయట పడతారు. తక్కువ మాట్లాడడం మంచిది. వ్యాపారాల్లో కొత్త పెట్టుబడులు పేటడం వల్ల లాభాలు కలుగుతాయి.

పరిహారాలు: కాలభైరవ అష్టకం పారాయణం చేసుకోండి.

 

తులారాశి:ఈరోజు ఉద్యోగస్తులు ప్రమోషన్లు పొందుతారు !

ఈరోజు అనుకూలంగా ఉంటుంది.కుటుంబ సభ్యులతో కలిసి మెలిసి ఆనందంగా ఉంటారు. సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందుతారు. ఉద్యోగస్తులకు ప్రమోషన్లు పొందే అవకాశం ఉంది. అనవసరపు ఖర్చులకు దూరంగా ఉండి రావాల్సిన డబ్బును సమయానికి చేతికి అందుకుంటారు. ధనవృద్ధి పొందుతారు. స్నేహితుల సహకారాన్ని అందుకుంటారు. శత్రువులు కూడా మిత్రుల అవుతారు. శత్రు నాశనం కలుగుతుంది. నిరుద్యోగులకు ఉద్యోగం కలిగే అవకాశం ఉంది.

పరిహారాలు: ద్వాదశ జ్యోతిర్లింగ పారాయణం చేసుకోండి.

 

వృశ్చిక రాశి:ధన ప్రాప్తి పొందుతారు !

ఈరోజు బాగుంటుంది. విద్యార్థులు బాగా చదువుకొని ఉత్తమ విద్యార్థులుగా పేరు ప్రఖ్యాతలు పొందుతారు. ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహిస్తారు. గొప్ప వ్యక్తులతో పరిచయం పెంచుకుంటారు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం కలుగుతుంది. వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టి ధన ప్రాప్తి పొందుతారు. రుణ బాధలు తొలగిపోతాయి. ఈరోజు ఉత్సాహంగా ఉంటారు. పనులను సకాలంలో పూర్తి చేస్తారు.

పరిహారాలు: ఆవుకు పశుగ్రాసం సమర్పించండి.

 

ధనసు రాశి:ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది !

భార్యా భర్తలు అన్యోన్యంగా ఉంటారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. ఈరోజు ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. కుటుంబ సభ్యులతో ఎక్కువ సమయాన్ని గడుపుతారు. గృహ నిర్మాణ పనులు చేపడుతారు. ఉద్యోగాలలో ప్రమోషన్లు పొందుతారు. పోటీ పరీక్షల్లో విజయం పొందుతారు. ఈరోజు లాభదాయకంగా ఉంటుంది. అనుకోని చోటు నుంచి శుభవార్త వింటారు. విద్యార్థులకు శ్రమకు తగ్గ ఫలితం ఉంటుంది. వ్యాపారాలు కలిసి వస్తాయి.

పరిహారాలు: లక్ష్మీ కుబేర ఆరాధన చేయండి.

 

మకర రాశి:ఈరోజు ఉద్యోగాలలో ఒత్తిడి !

ఈరోజు ఇబ్బందికరంగా ఉంటుంది. ఆరోగ్య విషయంలో జాగ్రత్త. మౌనంగా ఉండటం మంచిది. పెట్టుబడులు వల్ల నష్టం. ఈరోజు ఆచితూచి నిర్ణయాలు తీసుకోవడం మంచిది. ఉద్యోగాలలో ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది. స్థితిప్రజ్ఞతో ఉండటం మంచిది. సమయానికి చేతిలో డబ్బు లేక ఇబ్బంది పడతారు. వ్యసనాల వల్ల ఇబ్బంది పడతారు. అప్పుల వల్ల ఇబ్బందులు. ధన నష్టం జరిగే అవకాశం ఉంది. కుటుంబ సభ్యుల మధ్య విభేదాలు ఏర్పడే అవకాశం ఉంది.

పరిహారాలు: గ్రామ సింహనీకి రొట్టెలను వెయ్యండి.

 

కుంభ రాశి:పేరు ప్రఖ్యాతలు పొందుతారు !

కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. పనులను సకాలంలో పూర్తి చేస్తారు. లక్ష్యం కోసం బాగా కష్ట పడతారు. సమాజంలో పేరు ప్రఖ్యాతులు పొందారు. దూర ప్రాంతాల నుంచి శుభవార్త వింటారు. ఆకస్మిక ధన లాభం కలుగుతుంది. ఉద్యోగాలలో అనుకూలత. శుభకార్యాల్లో పాల్గొంటారు. విహార యాత్రలు చేయడానికి ఆసక్తి చూపుతారు.

పరిహారాలు: కామాక్షి అమ్మవారి ఆరాధన చేయండీ.

 

మీన రాశి:మిత్ర లాభం పొందుతారు !

ఈరోజు ఆనందంగా ఉంటారు. వ్యాపారాలలో అనుకోని లాభాలు పొందుతారు. ఈరోజు క్రయ విక్రయాలు చేయడానికి అనుకూలం. మిత్ర లాభం పొందుతారు. ఉద్యోగాలలో పై అధికారుల నుంచి ప్రశంసలు అందుకుంటారు. ధన లాభం పొందుతారు. శ్రమకు తగ్గ ఫలితం ఉంటుంది. గృహ నిర్మాణ పనులు చేపడతారు.

పరిహారాలు: ఏకముఖి రుద్రాక్షను ధరించండి.

 

– శ్రీ

Read more RELATED
Recommended to you

Latest news