ఏపీ ప్రభుత్వం, ఎన్నికల సంఘం మీద లేఖల యుద్ధం ముదురుతోంది. నిన్నఎస్ఈసీ ఆదేశాలు అమలు కాకుండా.. జీఏడీ పొలిటికల్ సెక్రటరీ ప్రవీణ్ ప్రకాష్ అడ్డుకుంటున్నారని.. ఆయన్ను ఎన్నికల విధుల నుంచి.. ప్రత్యేకించి జీఏడీ పొలిటికల్ పోస్ట్ నుంచి తప్పించాలని ఎస్ఈసీ మళ్ళీ లేఖ రాశారు. అయితే దీనికి కౌంటర్ గా ఎస్ఈసీ నిమ్మగడ్డకు లేఖ రాసిన సీఎస్ ఆదిత్య నాధ్ దాస్, ప్రవీణ్ ప్రకాష్ మీద చర్యలు తీసుకోవడం కుదరదని స్పష్టం చేస్తూ లేఖలో పేర్కొన్నారు.
ప్రవీణ్ ప్రకాష్ ఇచ్చిన వివరణను ఎస్ఈసీకి రాసిన లేఖలో ప్రస్తావించిన సీఎస్, ఎస్ఈసీ సూచించిన విధంగా ప్రవీణ్ ప్రవీణ్ ప్రకాషుని మార్చడం కుదరదని లేఖలో స్పష్టం చేశారని తెలుస్తోంది. ఎన్నికలను ప్రభావితం చేసే పదవిలో ప్రవీణ్ ప్రకాష్ లేరన్న సీఎస్, జీఏడీ పొలిటికల్ సెక్రటరీకి కలెక్టర్లు, ఎస్పీలు రిపోర్టు చేయరనే విషయాన్ని లేఖలో ప్రస్తావించినట్టు చెబుతున్నారు. గతంలో వీడియో కాన్ఫరెన్సుకు హాజరు కాకూడదన్న ప్రభుత్వ నిర్ణయాన్నే ప్రవీణ్ ప్రకాష్ అమలు చేశారన్న సీఎస్, ప్రవీణ్ ప్రకాష్ మీద చర్యలు తీసుకోవాలన్న నిర్ణయాన్ని పునః పరిశీలించాలని ఎస్ఈసీని కోరారు.