ఫిబ్రవరి 3 బుధవారం: రాశి ఫలాలు మరియు పరిహారాలు

-

శ్రీరామ ఫిబ్రవరి – 3- బుధవారం. పుష్యమాసం.

 

మేష రాశి:మొండి బాకీలు వసూలవుతాయి !

ఈరోజు బాగుంటుంది. అనుకున్న పనులు అనుకున్న సమయంలో పూర్తి చేసుకొని కార్యసిద్ధి పొందుతారు. నూతన వ్యక్తులతో పరిచయాలు ఏర్పరచుకుంటారు. విద్యార్థులు బాగా చదువుకొని ఉన్నత విద్యను పొందుతారు. ఇంతకుముందు ఉన్న మొండి బాకీలు ఈరోజు వసూలవుతాయి. అప్పుల బాధలు తీరిపోతాయి. ఆరోగ్య విషయంలో బాగుంటారు, సమస్త ఆరోగ్యాన్ని పొందుతారు. వ్యాపారంలో కొత్త పెట్టుబడులు పెట్టి లాభాలు పొందుతారు.

పరిహారాలు: ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణం చేసుకోండి.

 

వృషభ రాశి:ఈరోజు ఇబ్బందికరంగా ఉంటుంది !

ఈరోజు అనుకూలమైన రోజు కాదు. ప్రయాణాలకు దూరంగా ఉండటం మంచిది. వాహన ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా చేయడం మంచిది, చిన్న చిన్న ప్రమాదాలు ఏర్పడే అవకాశం ఉంది.  అనవసరపు ఖర్చులకు దూరంగా ఉండటం మంచిది. అప్పులు ఇవ్వడం తీసుకోవడం చేయకుండా ఉండటం మంచిది. ఈరోజు తొందరపది ఎదుటివారు చెప్పిన మాటలను వినడం వల్ల నష్టం జరిగే అవకాశం ఉంది. వ్యసనాలకు దూరంగా ఉండడం మంచిది. పెద్దవారిని గౌరవించడం మంచిది.

పరిహారాలు: ఈరోజు శ్రీ రామ రక్షా స్తోత్రం పారాయణం చేసుకోండి, వేంకటేశ్వరస్వామికి దీపారాధన చేయడం మంచిది.

 

 మిధున రాశి:ఈరోజు కార్యసిద్ధి పొందుతారు !

ఈరోజు బాగుంటుంది. అప్పుల బాధలు తేరిపోయి ధన లాభం పొందుతారు. ఎంత కష్టమైన పనినైనా శ్రమపడి అనుకున్న సమయంలో పూర్తి చేస్తారు, కార్యసిద్ధి పొందుతారు. ఉద్యోగంలో అభివృద్ధి చండి పై అధికారుల మెప్పు పొందుతారు. వ్యాపార లాభాలు కలుగుతాయి. వివాహాది సంబంధ విషయాల చర్చలు ఫలిస్తాయి. తీర్థయాత్రలు చేస్తారు.

పరిహారాలు: బిల్వాష్టకం పారాయణం చేసుకోండి.

 

కర్కాటక రాశి:ఈరోజు శుభకార్యాన్ని తలపెడతారు !

ఈరోజంతా శుభదినంగా ఉంటుంది. వ్యాపార వృద్ధి పెరిగి లాభాలు కలుగుతాయి. కుటుంబ సభ్యులతో, మిత్రులతో సంతోషంగా ఉంటారు. అనవసరపు ఖర్చులను తగ్గించుకొని మొండి బాకీలు వసూలు చేసుకుని ధనవృద్ధి చేస్తారు. కాంట్రాక్టు ఉద్యోగులకు ప్రభుత్వ ఉద్యోగం కలుగుతుంది. ఏదో ఒక శుభకార్యాన్ని తలపెడతారు. కనక వస్తువులను కొనుగోలు చేస్తారు. ప్రయాణ లాభాలు కలుగుతాయి. ఇంటి స్థలాన్ని కొనుగోలు చేస్తారు.

పరిహారాలు: దక్షిణామూర్తి స్తోత్రం పారాయణం చేసుకోండి.

 

సింహరాశి:తీర్థయాత్రలు చేస్తారు !

ఈరోజంతా అనుకూలంగా ఉంటుంది. ప్రయాణాలకు అనుకూలమైన రోజు. తీర్థయాత్రలు చేస్తారు. గొప్ప వ్యక్తులతో పరిచయాలు ఏర్పరచుకుంటారు. సమాజంలో గౌరవ మర్యాదలు పొందుతారు. తలపెట్టిన పనిని అనుకున్న సమయంలో పూర్తి చేసి కార్యసిద్ధి పొందుతారు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం. విద్యార్థులు బాగా కష్టపడి చదువుకుని పోటీపరీక్షల్లో విజయం పొందుతారు. వ్యాపారంలో పెట్టుబడులు పెట్టి లాభాలు పొందుతారు. ఈరోజంతా ఆరోగ్యంగా ఉంటారు.

పరిహారాలు: ఈరోజు నవరత్నమాలికా స్తోత్ర పారాయణం చేసుకోండి.

 

కన్యారాశి:ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్త !

ఈరోజు ఇబ్బందికరంగా ఉంటుంది. వాహన ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా చేయడం మంచిది, ప్రమాదాలు ఏర్పడే అవకాశం ఉంది. గర్భిణీ స్త్రీలు జాగ్రత్తగా ఉండటం మంచిది. విలువైన వస్తువులను జాగ్రత్తగా చూసుకోవడం మంచిది, ఎక్కడైనా పడిపోయే అవకాశం ఉంది. ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండటం మంచిది, అనారోగ్య సమస్యలు ఏర్పడే అవకాశం ఉంటుంది. సాంప్రదాయమైన ఆహారానికి ప్రాధాన్యత నివ్వడం మంచిది. తక్కువగా మాట్లాడడం మంచిది. వివాదాలను తగ్గించుకోవడం మంచిది. కొత్త వ్యాపార పెట్టుబడి పెట్టకపోవటం మంచిది, నష్టం ఏర్పడే అవకాశం ఉంటుంది.

పరిహారాలు: ఈరోజు విష్ణుసహస్రనామ పారాయణం చేసుకోండి.

 

 తులారాశి:ధన లాభం పొందుతారు !

ఈరోజు బాగుంటుంది. విద్యార్థులు బాగా చదువుకొని పోటీ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించి విద్యా అభివృద్ధి పొందుతారు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం వస్తుంది. వ్యాపార పెట్టుబడులు పెట్టడానికి అనుకూలంగా ఉండి, లాభాలు పొందుతారు. అప్పుల బాధలు తీరిపోయి ధన లాభం పొందుతారు. బంగారు ఆభరణాలను కొనుగోలు చేస్తారు.

పరిహారాలు: అన్నపూర్ణ అష్టకం పారాయణం చేసుకోండి.

 

వృశ్చిక రాశి:ఈరోజు శుభవార్తలు వింటారు !

ఈరోజు అదృష్ట వంతమైన రోజు. ధనవృద్ధి పొందుతారు. ప్రయాణాలకు అనుకూలమైన రోజు. దేవాలయ దర్శనం చేసుకుంటారు. ఇంతకుముందు ఉన్న అప్పులన్నీ తీర్చుకొని ధన ప్రాప్తి పొందుతారు. వాహన కొనుగోలు చేస్తారు. నూతన వ్యక్తుల పరిచయాలు లాభాలు కల్పిస్తాయి. వ్యాపారం విస్తరించడం వల్ల లాభాలు పొందుతారు నిరుద్యోగులు నూతన ఉద్యోగం పొందుతారు. అయిన వారి నుంచి శుభవార్తలు వింటారు.

పరిహారాలు: ఈరోజు లలిత అష్టోత్తర పారాయణం చేసుకోండి.

 

 ధనస్సు రాశి:ఈరోజు పరిచయాలు ఏర్పరచుకుంటారు !

ఈరోజు బాగుంటుంది. దేవాలయ నిర్మాణంలో పాలుపంచుకుంటారు. గొప్ప వ్యక్తులతో పరిచయాలు ఏర్పరచుకుంటారు. ఇంతకుముందు ఉద్యోగం కోల్పోయిన వారు ఈరోజు తిరిగి పొందుతారు. ఉద్యోగస్తులు ప్రమోషన్లు పొందుతారు. విద్యార్థులు బాగా చదువుకొని పోటీపరీక్షల్లో ఉత్తీర్ణత సాధించి పై చదువులకు అర్హులవుతారు. వ్యాపార లాభాలు కలుగుతాయి.

పరిహారాలు: కనకదారా స్తోత్రం పారాయణం చేసుకోండి.

 

 మకర రాశి:ఆరోగ్య విషయంలో జాగ్రత్త !

ఈరోజు కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. మీలో ఉన్న తొందరపాటు తనాన్ని తగ్గించుకోవడం మంచిది. గర్భిణీ స్త్రీలు జాగ్రత్తగా ఉండటం మంచిది. ప్రయాణాలకు అనుకూలమైన రోజు కాదు. ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండండి. అనారోగ్య సమస్యలు ఏర్పడే అవకాశం ఉంటుంది. అనవసరపు విషయాలకు దూరంగా ఉండటం మంచిది. తల్లిదండ్రులను గౌరవించడం మంచిది. ఉద్యోగస్తులకు కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది.

పరిహారాలు: లక్ష్మి అష్టోత్తర పారాయణం చేసుకోండి, బీదవారికి వస్త్రదానం చేయండి.

 

కుంభరాశి:ఈరోజు ప్రయాణాలకు అనుకూలం !

ఈరోజంతా ప్రయోజకరంగా ఉంటుంది. శత్రువులు కూడా మిత్రులు అవుతారు. రుణ విమోచన పొందుతారు. ఆరోగ్య విషయంలో బాగుంటారు, సమస్త ఆరోగ్యాన్ని పొందుతారు. నిరుద్యోగులు ఉద్యోగ అవకాశాలు పొందుతారు. మొండి బకాయిలు వసూలు .ఆకస్మిక ధన ప్రాప్తి పొందుతారు. ఇంతకుముందే ఎవరికైనా మాట ఇస్తే దాన్ని ఈరోజు నిలబెట్టుకుంటారు. ప్రయాణాలకు అనుకూలమైన రోజు.

పరిహారాలు: ఈరోజు లక్ష్మీ నరసింహ కరావలంబ స్తోత్ర పారాయణం చేసుకోండి.

 

మీన రాశి:వ్యాపారంలో స్వల్ప లాభాలు !

ఈరోజు అన్నింటి మీద శ్రద్ధ పెట్టి చేస్తే బాగుంటుంది. విద్యార్థులు కష్టపడి చదువు మీద దృష్టి పెట్టడం మంచిది. ప్రతికూల పరిస్థితులు ఉంటాయి. ఈరోజు తక్కువగా మాట్లాడడం మంచిది. ప్రయాణం చేయడం మంచిది. ఉద్యోగస్తులకు పని ఒత్తిడి పెరిగి మానసిక వేదన ఏర్పడే అవకాశం ఉంది. వ్యాపారంలో స్వల్ప లాభాలు కలుగుతాయి.

పరిహారాలు: ఈరోజు దేవీ ఖడ్గమాలా స్తోత్ర పారాయణం చేసుకోండి, బీద వారికి భోజన అనం చేయండి.

Read more RELATED
Recommended to you

Latest news