ఫిబ్రవరి 05 శుక్రవారం: రాశి ఫలాలు మరియు పరిహారాలు

-

శ్రీరామ పుష్యమాసం – ఫిబ్రవరి – 5  –  శుక్రవారం.

 

మేష రాశి:ప్రయాణాలకు అనుకూలం !

ఈరోజు అనుకూలంగా ఉంటుంది. మొండి బకాయిలు వసూలు చేసుకొని ధన యోగం పొందుతారు. ఎంత కష్టమైన పనినైనా ఆత్మస్థైర్యంతో సరైన సమయానికి పూర్తి చేస్తారు. వివాహ నిశ్చయ తాంబూలాలకు అనుకూలమైన రోజు. వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టి లాభాలు పొందుతారు. అందరూ మిమ్మల్ని ఆకట్టుకుంటారు. విద్యార్థులు బాగా చదువుకుని పోటీపరీక్షల్లో విజయం పొందుతారు. ప్రయాణాలకు అనుకూలమైన రోజు. బంగారు ఆభరణాలను కొనుగోలు చేస్తారు.

పరిహారాలు: ఈరోజు శ్రీ దక్షిణామూర్తి స్తోత్రం పారాయణం చేసుకోండి.

 

todays horoscope

వృషభ రాశి:పై అధికారుల కీర్తిని పొందుతారు !

ఈరోజు ఆనంద యోగంగా ఉంటుంది. అందరితో కలిసి మెలిసి సఖ్యతగా, సంతోషంగా ఉంటారు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కలుగుతాయి. ఉద్యోగస్తులు ఆఫీసులో పై అధికారుల కీర్తిని పొందుతారు. అనారోగ్యాలను తగ్గించుకొని ఆరోగ్యంగా ఉంటారు. మిత్ర లాభం పొందుతారు. ప్రయాణాలకు అనుకూలం. కొత్త వ్యాపారాలను ప్రారంభించి లాభాలు పొందుతారు.

పరిహారాలు: కనకధారా స్తోత్ర పారాయణం చేసుకోండి.

 

మిధున రాశి:ధన లాభం పొందుతారు !

ఈరోజు శుభయోగంగా ఉంటుంది. సాంప్రదాయకమైన ఆహారాన్ని తీసుకొని భోజన సౌఖ్యాన్ని పొందుతారు. మొండి బకాయిలు వసూలు చేసుకుని ధన లాభం పొందుతారు. ప్రయాణాలు కలిసి వస్తాయి. చేపట్టిన పనులను సరైన సమయానికి పూర్తిచేస్తారు. కార్యసిద్ధి పొందుతారు. నూతన గృహాలను కొనుగోలు చేస్తారు. విద్యార్థులు బాగా కష్టపడి చదువుకుని పోటీపరీక్షల్లో విజయం పొందుతారు. దంపతులిద్దరూ అన్యోన్యంగా ఉంటారు.

పరిహారాలు: లక్ష్మీ అమ్మవారి ఆరాధన చేసుకోండి.

 

కర్కాటక రాశి:ఉత్తమ విద్యార్థిగా పేరు పొందుతారు !

ఈరోజు అనుకూలంగా ఉంటుంది. అనుకున్న పనులను అనుకున్న సమయానికి పూర్తి చేసి కార్య లాభం పొందుతారు. ప్రయాణాలు అనుకూలిస్తాయి. తీర్థయాత్రలు చేస్తారు. తల్లిదండ్రుల సౌఖ్యాన్ని పొందుతారు. సోదరులతో కలిసి మెలిసి సఖ్యతగా ఉంటారు. విద్యార్థులు బాగా కష్టపడి చదువుకుని ఉత్తమ విద్యార్థిగా పేరు పొందుతారు. వివాహ నిశ్చయ తాంబూలాలకు అనుకూలమైన రోజు. గృహంలో ఏదైనా ఒక శుభకార్యాన్ని జరుపుతారు. వ్యాపారాల్లో లాభాలు పొందుతారు.

పరిహారాలు: ఈరోజు లలిత అష్టోత్తర శతనామ స్తోత్రం పారాయణం చేసుకోండి.

 

సింహరాశి:వాహన కొనుగోలు చేస్తారు !

ఈరోజు బాగుంటుంది. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం కలుగుతుంది. వివాహ సంబంధ విషయాలు అనుకూలిస్తాయి. ఉద్యోగ స్థలం కోరుకున్న స్థానాలకు బదిలీ అయ్యే అవకాశం ఉంది. వ్యాపారాలను విస్తరించుకొని లాభాలు పొందుతారు. ఇంట్లో శుభకార్యాలు తలపెడతారు. విద్యార్థులు కష్టపడి బాగా చదువుకుంటారు. వాహనం కొనుగోలు చేస్తారు.

పరిహారాలు: ఈరోజు షట్పది స్తోత్రం పారాయణం చేసుకోండి.

 

కన్యారాశి:పోటీ పరీక్షల్లో విజయం !

ఈరోజు అనుకూలంగా ఉంటుంది. ఎవరు శత్రువులు ఎవరూ మిత్రులు అని తెలుసుకుంటారు. విద్యార్థులు బాగా చదువుకొని పోటీ పరీక్షల్లో విజయం పొందుతారు. తక్కువగా మాట్లాడండి. విలువైన విషయాలను బయటకు చెప్పకుండా ఉండటం మంచిది. నిరుద్యోగులకు ఉద్యోగం కలిగే అవకాశం ఉంది. కుటుంబ సభ్యులతో కలిసి మెలిసి ఉంటారు. అయిన వారి నుంచి ఆదరణ పొందుతారు

పరిహారాలు: ఈరోజు నవగ్రహ స్తోత్ర పారాయణం చేసుకోండి, దగ్గర్లో ఉన్న ఆలయానికి వెళ్లి ఆలయానికి వెళ్లి 11 నవగ్రహ ప్రదక్షిణలు చేయండి.

 

తులారాశి:ఆనారోగ్యాన్ని తగ్గించుకుంటారు !

ఈరోజు ప్రయోజకరంగా ఉంటుంది. కుటుంబ సభ్యులతో కలిసిమెలిసి ఆనందంగా ఉంటారు. విద్యార్థులు బాగా కష్టపడి చదువుకుని పోటీ పరీక్షల్లో విజయం సాధించి ఉత్తమ ఉద్యోగాలు పొందుతారు. నిరుద్యోగులు ఉద్యోగ అవకాశం పొందుతారు. వివాహాది విషయాలకు అనుకూలమైన రోజు. సమాజంలో గౌరవాన్ని పొందుతారు. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకొని ఆనారోగ్యాన్ని తగ్గించుకుంటారు.

పరిహారాలు:  గణేశ స్తోత్రం పారాయణం చేసుకోండి.

 

వృశ్చిక రాశి:ఈరోజు సమయస్ఫూర్తిగా ఉంటారు !

ఈరోజు శుభ యోగంగా ఉంటుంది. ప్రయాణాలకు అనుకూలం. వాహనాలు కొనుగోలు చేస్తారు. ఎవరితో అయినా తెలివిగా, సమయస్ఫూర్తిగా ఉంటారు. వివాహ సంబంధ విషయాల్లో అనుకూలిస్తాయి. రహస్యాలు బయటికి చెప్పకపోవడం మంచిది. ఉద్యోగస్తులు కార్యాలయాల్లో ఉత్తమ ఉద్యోగుల పేరు పొందుతారు.

పరిహారాలు: హనుమాన్ చాలీసా పారాయణం చేసుకోండి.

 

ధనస్సు రాశి:శత్రువులు మిత్రులు అవుతారు !

ఈరోజు బాగుంటుంది. ఎంత కష్టమైన పనినైనా ధైర్యంగా చేపట్టి అనుకున సమయానికి పూర్తి చేస్తారు. శత్రువులు కూడా మిత్రులు అవుతారు. బంగారు ఆభరణాలు కొనుగోలు చేస్తారు. ప్రయాణ లాభాలు కలుగుతాయి. తీర్థయాత్రలు చేస్తారు. కొత్త వ్యక్తులతో పరిచయాలు ఏర్పరచుకుంటారు. గతంలో పోగొట్టుకున్న డబ్బును తిరిగి పొందుతారు. పిల్లల విషయంలో జాగ్రత్తలు తీసుకుంటారు. వ్యాపారంలో లాభాలు పొందుతారు.

పరిహారాలు: దత్తాత్రేయ స్వామి ఆరాధన చేసుకోండి.

 

 మకర రాశి:ఈరోజు పేరు ప్రఖ్యాతలు పొందుతారు !

ఈరోజు అనుకూలంగా ఉంటుంది. నిరుద్యోగులు ఉద్యోగ లాభం పొందుతారు. విద్యార్థులు బాగా చదువుకొని పేరు ప్రఖ్యాతలు పొందుతారు. వ్యాపారాలను విస్తరించుకొని లాభాలు పొందుతారు. అనారోగ్యాన్ని తగ్గించుకొని ఆరోగ్యంగా ఉంటారు. ధన లాభం పొందుతారు. కుటుంబ సభ్యులతో సంతోషంగా, సఖ్యతగా ఉంటారు.

పరిహారాలు: ఈరోజు శివ అష్టోత్తర పారాయణం చేసుకోండి.

 

 కుంభరాశి:ఈరోజు పదోన్నతులు పొందుతారు !

ఈరోజు బాగుంటుంది. ఉద్యోగస్తులు కార్యాలయాల్లో పదోన్నతులు పొందుతారు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం కలుగుతుంది. విద్యార్థులు కష్టపడి బాగా చదువుకుంటారు. అధిక ధన లాభాలు పొందుతారు. వివాహ సంబంధ విషయాలు అనుకూలిస్తాయి. స్థిరాస్తులు కొనుగోలు చేస్తారు. వాహనాలు కొనుగోలు చేస్తారు.

పరిహారాలు: బాలా త్రిపుర సుందరి అమ్మవారి ఆరాధనా చేసుకోండి.

 

మీన రాశి:పోగొట్టుకున్న డబ్బును తిరిగి పొందుతారు !

ఈరోజు ప్రయోజకరంగా ఉంటుంది. విలువైన వస్తువులను జాగ్రత్తగా చూసుకుంటారు. గతంలో పోగొట్టుకున్న డబ్బును తిరిగి పొందుతారు. కాంట్రాక్టు ఉద్యోగులు పర్మినెంట్ అవుతుంది. కొత్త వ్యాపారాలను ప్రారంభించి లాభాలు పొందుతారు. తల్లిదండ్రుల సౌఖ్యాన్ని కోరుకుంటారు.

పరిహారాలు: ఈరోజు విష్ణు సహస్రనామ పారాయణ చేసుకోండి.

 

Read more RELATED
Recommended to you

Latest news