నిజామాబాద్ బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ బోడి గుండుపై కాంగ్రెస్ మహిళా నాయకురాలు జోకులు వేసింది. తెలంగాణ నుంచి బీజేపీకి 8 మంది పార్లమెంట్ సభ్యులు ఉన్నారు. వీరి పలుకుబడితో తెలంగాణకు కేంద్రం నుంచి నిధులు వస్తాయని ఆశించాము.
తెలంగాణకు కిషన్ రెడ్డికి జుట్టు ఉన్నంత నిధులు వస్తాయని అనుకుంటే, కనీసం బండి సంజయ్‌కి ఉన్న జుట్టంత కూడా రాలేదు. చివరికి ధర్మపురి అరవింద్‌కు ఉన్న జుట్టంత నిధులు వచ్చాయి. అంటే తెలంగాణకు బోడి గుండు వచ్చింది అని సదరు మహిళ నాయకురాలు గాంధీ భవన్ వేదికగా చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.