మిస్ వరల్డ్ అందాల పోటీలపై స్మిత సబర్వాల్ కీలక ప్రకటన

-

మిస్ వరల్డ్ అందాల పోటీలపై టూరిజం శాఖ ప్రిన్సిపాల్ సెక్రటరీ స్మిత సబర్వాల్ కీలక ప్రకటన చేశారు. మిస్ వరల్డ్ అందాల పోటీలకు రాబోతున్న వారికి అందరికీ స్వాగతం పలికారు. ప్రస్తుత మిస్ వరల్డ్ క్రిస్టినా, మిస్ వరల్డ్ సీఈఓ కి సాదర స్వాగతం అన్నారు. తెలంగాణ చాలా ఆనందంగా ఉంది.. ఇంత పెద్ద ఈవెంట్ కి వేదిక అయ్యిందని తెలిపారు. తెలంగాణ లో అనేక ప్రత్యేకతలు ఉన్నాయన్నారు. తెలంగాణ అనేక సంస్కృతులకు, సంప్రదాయాలకు ప్రతీక అని తెలిపారు.

Smita Sabharwal’s key statement on Miss World beauty pageants

ఎన్నో ప్రసిద్ధ ఆలయాలు ఉన్నాయి… ఎంతోమంది మేధావులు, కవులతో ఉన్న ఇల్లు తెలంగాణ అని కొనియాడారు. తెలంగాణ వంటకాలు, హైద్రాబాద్ బిర్యాని, ఇరానీ చాయ్ ఇక్కడ స్పెషల్స్..ఎంతోమంది క్రీడాకారులను అందించిన తెలంగాణ అంటూ కొనియాడారు. కాగా… హైదరాబాద్ వేదికగా 72వ మిస్ వరల్డ్ పోటీలు జరుగనున్నాయి. ఈ తరునంలోనే బేగంపేట్ టూరిజం ప్లాజాలో ప్రీ ఈవెంట్ ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఇందులో మంత్రి జూపల్లి, TGTDC చైర్మన్ పటేల్ రమేశ్ రెడ్డి, టూరిజం సెక్రటరీ స్మితా సబర్వాల్, మిస్ వరల్డ్ లిమిటెడ్ సీఈఓ జూలియా మోర్లీ, 2024 ప్రపంచ సుందరి క్రిస్టినా పిజ్కోవా పాల్గొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news