నమస్తే ఇండియాతో ప్రసంగం మొదలుపెట్టిన ప్రపంచ సుందరి

-

నమస్తే ఇండియాతో ప్రసంగం మొదలుపెట్టారు ప్రపంచ సుందరి క్రిస్టినా పిజ్కోవా. తెలంగాణలో చాలా దేవాలయాలను సందర్శించానని… ఇండియాలో ఒక స్పిరిట్ ఉందని తెలిపారు ప్రపంచ సుందరి క్రిస్టినా పిజ్కోవా.హైదరాబాద్ వేదికగా 72వ మిస్ వరల్డ్ పోటీలు జరుగనున్నాయి. ఈ తరునంలోనే బేగంపేట్ టూరిజం ప్లాజాలో ప్రీ ఈవెంట్ ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఇందులో మంత్రి జూపల్లి, TGTDC చైర్మన్ పటేల్ రమేశ్ రెడ్డి, టూరిజం సెక్రటరీ స్మితా సబర్వాల్, మిస్ వరల్డ్ లిమిటెడ్ సీఈఓ జూలియా మోర్లీ, 2024 ప్రపంచ సుందరి క్రిస్టినా పిజ్కోవా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా నమస్తే ఇండియాతో ప్రసంగం మొదలుపెట్టారు ప్రపంచ సుందరి క్రిస్టినా పిజ్కోవా.
వివిధ మతాల వారు కలిసి జీవిస్తున్నారని వెల్లడించారు. ఇక్కడ ట్రెడిషన్ చాలా బాగా నచ్చిందన్నారు క్రిస్టినా పిజ్కోవా. అటు మిస్ వరల్డ్ అందాల పోటీలపై టూరిజం శాఖ ప్రిన్సిపాల్ సెక్రటరీ స్మిత సబర్వాల్ కీలక ప్రకటన చేశారు. మిస్ వరల్డ్ అందాల పోటీలకు రాబోతున్న వారికి అందరికీ స్వాగతం పలికారు. ప్రస్తుత మిస్ వరల్డ్ క్రిస్టినా, మిస్ వరల్డ్ సీఈఓ కి సాదర స్వాగతం అన్నారు. తెలంగాణ చాలా ఆనందంగా ఉంది.. ఇంత పెద్ద ఈవెంట్ కి వేదిక అయ్యిందని తెలిపారు. తెలంగాణ లో అనేక ప్రత్యేకతలు ఉన్నాయన్నారు. తెలంగాణ అనేక సంస్కృతులకు, సంప్రదాయాలకు ప్రతీక అని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news