అమెజాన్ సేల్‌.. మ‌రికొద్ది గంట‌లే ఉంది. త్వ‌ర ప‌డండి..!

-

ఈ-కామ‌ర్స్ సంస్థ అమెజాన్ ( Amazon ).. ప్రైమ్ డే సేల్‌ను నిర్వ‌హిస్తున్న విష‌యం విదిత‌మే. ఈ సేల్ ముగిసేందుకు మ‌రికొద్ది గంట‌ల స‌మ‌యం మాత్ర‌మే ఉంది. ఈ క్ర‌మంలోనే ఈ సేల్‌లో అందుబాటులో ఉన్న భారీ త‌గ్గింపు ధ‌ర‌ల‌కు ల‌భిస్తున్న ప‌లు ఉత్ప‌త్తుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

యాపిల్‌కు చెందిన ఐఫోన్ 12 ప్రొ 128జీబీ మోడ‌ల్‌పై రూ.14వేల త‌గ్గింపును అందిస్తున్నారు. ఈ ఫోన్ ను రూ.1,05,900కు కొనుగోలు చేయ‌వ‌చ్చు. ఐఫోన్ 11 64జీబీ మోడ‌ల్‌పై రూ.6901 త‌గ్గింపు ధ‌ర ల‌భిస్తుంది. దీన్ని రూ.59,900కు కొన‌వ‌చ్చు.

వ‌న్‌ప్ల‌స్ 9 5జి 6జీబీ + 128 జీబీ మోడ‌ల్ రూ.4000 త‌గ్గింపుతో రూ.45,999 ధ‌ర‌కు ల‌భిస్తోంది. శాంసంగ్ గెలాక్సీ ఎం42 5జి 6జీబీ + 128 జీబీ రూ.1000 తగ్గింపుతో రూ.20,998కి ల‌భిస్తోంది. రెడ్‌మీ నోట్ 10 ప్రొ మ్యాక్స్ 6జీబీ + 128 జీబీ మోడ‌ల్‌ను రూ.1000 తగ్గింపుతో రూ.18,999 ధ‌ర‌కు కొనుగోలు చేయ‌వ‌చ్చు.

అలాగే ఎంఐ11ఎక్స్ 5జి, ఎంఐ 10ఐ 5జి, గెలాక్సీ ఎం51, ఐక్యూ జ‌డ్‌3 5జి, గెలాక్సీ ఎం31ఎస్, రెడ్‌మీ నోట్ 10 ఎస్‌, ఒప్పో ఎఫ్‌17, రెడ్‌మీ 9, టెక్నో స్పార్క్ 7టి, రెడ్‌మీ 9ఎ ఫోన్ల‌పై కూడా త‌గ్గింపు ధ‌ర‌ల‌ను అందిస్తున్నారు.

ఈ సేల్‌లో ల్యాప్‌టాప్‌ల‌పై రూ.35వేల వ‌ర‌కు, టీవీల‌పై 65 శాతం వ‌ర‌కు, స్మార్ట్ ఫోన్ కేసెస్‌పై 70 శాతం వ‌ర‌కు, యాక్ష‌న్ కెమెరాలు, యాక్స‌స‌రీల‌పై 61 శాతం వ‌ర‌కు, అమెజాన్ ఫైర్ టీవీ, ఎకో ఉత్ప‌త్తుల‌పై డిస్కౌంట్ల‌ను పొంద‌వ‌చ్చు. అలాగే బ్లూటూత్ స్పీక‌ర్లు, హెడ్ ఫోన్స్, ఇయ‌ర్ బ‌డ్స్‌, స్మార్ట్ వాచ్‌లు త‌దిత‌ర ఉత్ప‌త్తుల‌పై రాయితీల‌ను పొంద‌వ‌చ్చు.

Read more RELATED
Recommended to you

Exit mobile version