డ్రగ్స్ కేసులో సినీ నటుడు అభిషేక్ అరెస్ట్..!

-

డ్రగ్స్ కేసులో సినీ నటుడు అభిషేక్ ను యాంటి నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో అరెస్ట్ చేసింది. S.R.నగర్, జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లలో డ్రగ్స్ కేసుల్లో నిందితుడుగా ఉన్న అభిషేక్ కోర్టు కేసులకు హాజరుకాకపోవడంతో వారెంట్స్ జారీ అయ్యాయి. అభిషేక్ తెలంగాణ రాష్ట్రం నుంచి పారిపోయి గోవాలో రెస్టారెంట్ నిర్వహిస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. యాంటీ నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో స్పెషల్ టీమ్ గోవాకి వెళ్లి అభిషేక్ ను అరెస్ట్ చేసి హైదరాబాద్ సీసీఎస్ కి తరలించారు.

అభిషేక్ నువ్వొస్తానంటే నేనొద్దంటానా చిత్రంలో త్రిషను బలవంతంగా పెళ్లి చేసుకునేందుకు ప్రయత్నించే విలన్ పాత్రలో నటించారు. ఈ సినిమాతో పాటు పలు తెలుగు చిత్రాల్లో సైడ్ క్యారెక్టర్లలో నటించారు. డ్రగ్స్ నేపథ్యంలో అతను ప్రస్తుతం సినిమాలకు దూరమయ్యాడు. 2012 డిసెంబర్ లో అభిషేక్ ను పోలీసులు డ్రగ్స్ కేసులో అరెస్ట్ చేశారు. అభిషేక్, జి.శ్రీనివాసులు అనే వ్యక్తి స్కోడా కారులో ప్రయాణిస్తుండగా.. పోలీసులు చేపట్టిన తనిఖీల్లో 10 కొకైన్ ఫ్యాకెట్లతో పట్టుబడ్డాడు. అభిషేక్ తో పాటు ఇద్దరూ నైజీరియన్స్, నవీన్, శ్రీనివాస్ తో పాటు మరో వ్యక్తిని మొత్తం 6గురు వ్యక్తులను అరెస్ట్ చేశారు పోలీసులు. కొకైన్ ను ముంబైకి తీసుకొచ్చి అక్కడి నుంచి హైదరాబాద్ కి తరలిస్తున్నట్టు గుర్తించారు పోలీసులు.

Read more RELATED
Recommended to you

Exit mobile version