ఎట్టకేలకు ఓటీటీలో రజనీకాంత్ ‘లాల్ సలామ్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే ?

-

తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా తన కూతురు ఐశ్వర్య రజినీకాంత్ దర్శకత్వంలో నటించిన చిత్రం లాల్ సలాం. ఈ సినిమా ఫిబ్రవరి 9న ప్రేక్షకులకు ముందుకు భారీ అంచనాలతో వచ్చింది. అయితే ఈ సినిమా మాత్రం బాక్సాఫీస్ వద్ద సరైన ఆదరణను రాబట్టుకోలేకపోయింది.

ఇదిలా ఉంటే… లాల్ సలామ్ డిజిటల్ స్ట్రీమింగ్ కు సిద్ధమైంది. రజనీ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ సన్ నెక్ట్స్ కొనుగోలు చేసింది. ఈ నేపథ్యంలో తమిళ నూతన సంవత్సరం కానుకగా ఏప్రిల్ 12 నుంచి లాల్ సలామ్ ను ఓటీటీలోకి అందుబాటులోకి రానుంది. తమిళ్ తో పాటు తెలుగులోనూ ఈ స్ట్రీమింగ్ కు అందుబాటులోకి రానుంది. కాగా, ఈ చిత్రంలో విష్ణు విశాల్, విక్రాంత్ తదితరులు కీలక పాత్ర పోషించారు. ఈ సినిమాకి ఫేమస్ మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ సంగీతం అందించారు. కపిల్ దేవ్, జీవితా రాజశేఖర్ అతిథి పాత్రలు పోషించారు. ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్ పై సుభాస్కరన్ నిర్మించారు.

Read more RELATED
Recommended to you

Latest news