ఆంధ్రప్రదేశ్ అప్పుల గురించి ఆర్ధిక మంత్రి బుగ్గన కీలక ప్రకటన

-

పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్న వేళ సభలో ప్రతిపక్షాలు అధికార ప్రభుత్వాల గురించి లేని పోనీ సందేహాలను అడిగితెలుసుకుంటూ ఉంటారు.. అందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ అప్పుల గురించి టీడీపీ ఎంపీలు అడిగిన ప్రశ్నకు కేంద్ర ప్రభుత్వం లెక్కలతో సహా ఎంత అప్పు ఉన్న సంగతిని వివరించారు. తాజాగా ఏపీ అప్పులపై ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన విధంగా ఏపీకి ఉన్న అప్పులు రూ. 4 .42 లక్షల కోట్లు మాత్రమే అని బుగ్గన క్లారిటీ ఇచ్చాడు. అంతకు ముందున్న ప్రభుత్వంతో పోలిస్తే వైసీపీ ప్రభుత్వంలో అప్పులు పెరిగాయని అంగీకరించారు బుగ్గన. ఇక పెరిగిన అప్పులు మాత్రమే కాకుండా రెవెన్యూ రాబడి శాతం 16 .7 పెరిగినది కూడా చూడాలంటూ చెప్పారు మంత్రి బుగ్గన.

ఇక రాష్ట్రము అప్పులలో డిస్కం లతో పాటుగా రూ. 7 వేల కోట్లు అప్పులు తీర్చమని చెప్పారు బుగ్గన. ఇక రాష్ట్ర స్థూల ఉత్పత్తి పెరిగిన విషయాన్నీ కూడా ఇక్కడ మంత్రి బుగ్గన రాజేందర్ నాథ్ రెడ్డి ప్రస్తావించారు.

Read more RELATED
Recommended to you

Latest news