‘వూల్ఫ్’గా వస్తున్న ప్రభుదేవా.. ఆసక్తికరంగా టీజర్‌

-

స‌క్సెస్‌, ఫెయిల్యూర్స్‌తో సంబంధం లేకుండా త‌మిళంలో వ‌రుస‌గా సినిమాలు చేస్తున్న ప్రభుదేవా.. ప్రస్తుతం ‘వూల్ఫ్’ చిత్రంలో నటిస్తున్నాడు. నటుడిగా ఈ సినిమా ఆయనకు 60వది. తమిళంలో తెరకెక్కుతోన్న ఈ సినిమా.. పాన్ ఇండియ‌న్ మూవీగా హిందీ, తెలుగు, కన్నడ భాషల్లో విడుదల కానుంది. రాయ్ లక్ష్మీ .. అనసూయ భరద్వాజ్ ప్రధాన పాత్రలో, సందేశ్ నాగరాజు నిర్మాతగా ఈ చిత్రాన్ని నిర్మించారు. తమిళ .. తెలుగు .. కన్నడ .. హిందీ భాషల్లో తెరకెక్కనున్న ఈ మూవీ టీజర్‌ను తాజాగా రిలీజ్ చేశారు.

‘వుల్ఫ్’ టీజర్‌ను చూస్తుంటే ఇది తాంత్రిక శక్తులపై పరిశోధనలు .. మనుషులను బంధించడం .. బలి .. ఇవ్వడం వంటి సన్నివేశాలు కనిపిస్తున్నాయి. ఒక మాయా ప్రపంచానికి తీసుకెళ్లినట్టుగా అనిపిస్తోంది. అనసూయ, ప్రభుదేవా సరికొత్త లుక్కులో కనిపించారు. 69 సెకన్ల నిడివి ఉన్న ఈ టీజర్‌లో విజువల్స్ అద్భుతంగా ఉన్నాయి.

బ్యాక్ గ్రౌండ్ స్కోర్ నెక్ట్స్ లెవెల్‌లో ఉంది. ఇక ప్రభుదేవా యాక్షన్ సీక్వెన్స్‌లు, అనసూయ గెటప్ ఈ సినిమా మీద మరింతగా ఆసక్తిని పెంచుతున్నాయి. ఈ మూవీకి అరుల్ విన్సెంట్ కెమెరామెన్‌గా, అమ్రిష్ సంగీత దర్శకుడిగా, లారెన్స్ కిషోర్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇతర ప్రాతాల్లో వశిష్ట ఎన్ సింహా .. అంజు కురియన్ .. రమేష్ తిలక్ .. దీప .. శ్రీగోపిక .. అవినాష్ .. సుజాత కనిపించనున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news