BREAKING : పార్లమెంట్ లో బడ్జెట్ ప్రవేశ పెట్టిన నిర్మలా సీతారామన్..LIC పై కీలక ప్రకటన

-

కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ లోక్సభలో కాసేపటి క్రితమే 2022 బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఆమె బడ్జెట్ ప్రవేశపెట్టడం ఇది నాలుగోసారి. అయితే బడ్జెట్ ప్రవేశపెట్టిన అనంతరం కేంద్ర మంత్రి నిర్మల సీతారామన్ మాట్లాడుతూ… కరోనా కట్టడి లో వ్యాక్సినేషన్ బాగా కలిసి వచ్చిందని.. ప్రజల ప్రాణాలు కాపాడటం టీకా బాగా పని చేసిందని తెలిపారు. పేద అలాగే మధ్యతరగతి సాధికారత కోసం ప్రభుత్వం కృషి చేస్తుందని నిర్మల సీతారామన్ ప్రకటించారు.

వచ్చే 20 సంవత్సరాల పురోగతిని దృష్టిలో పెట్టుకుని బడ్జెట్ తయారు చేశామని పేర్కొన్నారు. ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ వేగంగా జరుగుతోందని చెప్పారు. ఆత్మ నిర్మల్ భారత్ స్పూర్తితో 16 లక్షల ఉద్యోగాలు సృష్టించాలని స్పష్టం చేశారు. త్వరలోనే ఎల్ఐసి పబ్లిక్ ఇష్యూ రాబోతుందని ప్రకటన చేశారు. నేషనల్ హైవేస్ నెట్వర్క్ను 25 వేల కిలోమీటర్లు పెంచుతామని స్పష్టం చేశారు. వృద్ధిరేటు లక్ష్యాన్ని 9.2 శాతం అంచనా వేస్తున్నట్లు తెలిపారు. ఇందుకు 20 వేల కోట్లు సమీకరిస్తున్నామని ప్రకటన చేశారు. పి ఎన్ గతిశక్తి మాస్టర్ ప్లాన్ తో ఆర్థిక వ్యవస్థకు దిశానిర్దేశం చేశామని తెలిపారు. దీని ద్వారా 60 లక్షల ఉద్యోగాలు భర్తీ చేసేందుకు లక్ష్యం పెట్టుకున్నామని చెప్పారు నిర్మల సీతారామన్.

Read more RELATED
Recommended to you

Exit mobile version