హైదరాబాద్‌లో కుండపోత వర్షం.. వరద నీటిలో ముగ్గురు గల్లంతు

-

హైదరాబాద్‌లో కుండపోత వర్షం ప‌డింది. నిన్న రాత్రి నుంచి ప‌డుతూనే ఉంది వ‌ర్షం. ఈ త‌రుణంలోనే వరద నీటిలో ముగ్గురు గల్లంతు అయ్యారు. ఆసిఫ్ నగర్‌లోని అఫ్జల్ సాగర్ మంగారు బస్తీ నాలాలో.. రాము, అర్జున్ (మామ, అల్లుడు) ఇద్ద‌రు కొట్టుకుపోయారు.

hyderabad rain
Torrential rain in Hyderabad Three missing in floodwaters

ముషీరాబాద్‌లోని వినోదానగర్ నాలాలో పడి సన్నీ అనే యువకుడు గల్లంతయ్యాడు.. ఇకీ ముగ్గురి కోసం పోలీసుల గాలింపు చర్యలు కొన‌సాగుతున్నాయి. మరోవైపు.. గచ్చిబౌలి పరిధిలో భారీ వర్షం ధాటికి గోడ కూలి ఒక వ్యక్తి మృతి, నలుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి.

కాగా, భారీ వర్షంతో హైదరాబాద్ నగరం అతలాకుతలం అవుతోంది. నిన్న(ఆదివారం) సాయంత్రం నుంచి రాత్రి వరకు ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షానికి పలు ప్రాంతాలు జలమయం అయ్యాయి. రోడ్డుపై భారీగా నీరు నిలిచి రాకపోకలకు అంతరాయం ఏర్ప‌డింది.

Read more RELATED
Recommended to you

Latest news