తప్పుడు ప్రకటన చేశారని సాంసంగ్‌ కంపెనీకి రూ. 75 కోట్లు జరిమానా..!

-

కష్టమర్స్‌ను ఎట్రాక్‌ చేయడానికి కంపెనీలో తమ పరిధికి మించి ప్రకటనలు చేస్తుంటాయి. ఆ ప్రొడెక్ట్స్‌లో లేని వాటిని కూడా ఉన్నట్లు చూపిస్తాయి. నిజానికి మనం చాలా చూసిచూడనట్లు వదిలేస్తాం కానీ.. ఏదైనా ప్రొడెక్టుకు సంబంధించి ఇచ్చిన అడ్వర్టైజ్‌మెంట్‌ తప్పు అయితే కన్సుమర్‌గా మనకు కేసు పెట్టే అధికారం ఉంది. అలా కేసు పెట్టి జరిమానాలు కట్టిన దాఖలాలు ఎన్నో ఉన్నాయి. తాజాగా ఆ లిస్ట్‌లోకి సామ్‌సంగ్‌ కూడా చేరింది. ఆస్ట్రేలియా కోర్టు సామ్‌సంగ్‌ కంపెనీకి భారీ జరిమానా విధించింది.
తప్పుడు ప్రకటనలతో యూజర్లను తప్పుదోవ పట్టించారన్న కారణంతో ఆస్ట్రేలియా కోర్టు సాంసంగ్‌ కంపెనీకి రూ. 75 కోట్లు జరిమానా వేసింది. సామ్‌సంగ్ ఆస్ట్రేలియా 2016 మార్చి నెల నుంచి 2018 అక్టోబర్ మధ్య ఎస్‌7, ఎస్‌8 సిరీస్‌కు చెందిన 31 లక్షల స్మార్ట్‌ఫోన్‌లను విక్రయించింది. ఈ నేపథ్యంలో ఈ ఫోన్‌ల ప్రకటనలో భాగంగా సామ్‌సంగ్‌ వాటర్‌ ప్రూఫ్‌ ఫోన్‌లు అప్పట్లో తెగ ప్రచారం చేసుకుంది.
అయితే..సీన్‌ కట్ చేస్తే.. మొబైల్‌ ఫోన్‌లను ఉపయోగించిన తర్వాత నీళ్లలో తడిచిన తమ ఫోన్‌లు పనిచేయడం లేదంటూ వందలాది మంది సామ్‌సంగ్‌ యూజర్లు ఫిర్యాదు చేయడం ప్రారంభించారు. ఈ క్రమంలోనే 2019లో పలు కేసులు కూడా నమోదయ్యాయి. సుమారు. రెండేళ్ల పాటు విచారణ జరిగన తర్వాత తాజాగా ఆస్ట్రేలియా కోర్టు తీర్పు వెలువరించింది.. దీంతో సంబంధిత స్మార్ట్‌ఫోన్‌లను ఉపయోగించిన యూజర్లు తమను సంప్రదించాలని సామ్‌సంగ్‌ ఓ ప్రకటన సైతం విడుదల చేసింది.
వాటర్‌ రెసిస్టెంట్స్‌ విషయంలో యూజర్లను సామ్‌సంగ్‌ తప్పుదోవ పట్టించదన్న కారణంతో ఆస్ట్రేలియన్‌ కాంపిటీషన్‌ అండ్‌ కన్జ్యూమర్‌ కమిషన్‌ (ACCC) సామ్‌సంగ్‌పై దావా వేసింది. సో.. కష్టమర్స్‌ను యట్రాక్ట్‌ చేసే ఉద్దేశంతో ఏవేవో యాడ్స్‌ ఇచ్చే కంపెనీలు ఇక కాస్త జాగ్రత్త పడాల్సిందే. ఈ మధ్యే ఓ పర్ఫ్యూమ్‌ యాడ్‌లో ఆడవారిని కించపరిచేలా ఉందని వాటిని తొలగించాలని కోర్టు కంపెనీకి గట్టిగా చివాట్లు పెట్టింది. అడ్వర్టైజింగ్‌ రూల్స్‌ను అతిక్రమించి చేసే ప్రకటనలకు ఎప్పటికైనా ముప్పు తప్పదు.!
-Triveni Buskarowthu

Read more RELATED
Recommended to you

Exit mobile version