జులై 1వ తేదీన తెలంగాణ టెట్ ఫలితాలు విడుదల

-

తెలంగాణలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) ఫలితాల విడుదల తేదీ పై స్పష్టత ఇచ్చింది రాష్ట్రప్రభుత్వం. టెట్ ఫలితాలను జూలై 1న విడుదల చేయాలని సంబంధిత అధికారులను రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆదేశించారు. తొలుత విడుదల చేసిన నోటిఫికేషన్ కు అనుగుణంగా ఈ నెల 27వ తేదీన టెట్ ఫలితాలు వెల్లడి కావాల్సి ఉంది. దీనిపై ఆదివారం రాత్రి వరకు అధికారికంగా ఎలాంటి ప్రకటన విడుదల కాలేదు. అయితే తాజాగా ఫలితాల విడుదలపై విద్యాశాఖ క్లారిటీ ఇచ్చింది.

రాష్ట్ర వ్యాప్తంగా టెట్ పేపర్ 1 కు 31,18,506, పేపర్ 2 కు 2,51,070 మంది అభ్యర్థులు హాజరయ్యారు. కాగా నేడు తెలంగాణలో ఇంటర్ ఫలితాలు విడుదలయ్యాయి. ఇంటర్ ప్రథమ ద్వితీయ సంవత్సరం ఫలితాలను రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి విడుదల చేశారు. పాస్ కాని విద్యార్థులకు ఆగస్టు ఒకటి నుంచి ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నట్లు మంత్రి పేర్కొన్నారు. ఈనెల 30వ తేదీ నుంచి సప్లిమెంటరీ ఫీజు చెల్లించేందుకు అవకాశం కల్పించినట్లు చెప్పారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version