కేవలం తెలుగు సినీ ఇండస్ట్రీలోనే పవర్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్న పవన్ కళ్యాణ్ దేశ వ్యాప్తంగా అభిమానులను సొంతం చేసుకోవడంలో మొదటి స్థానంలో ఉన్నారు అనడంలో సందేహం లేదు . ఇక ఇతర భాషలలో ఈయన సినిమాలు విడుదల కాకపోయినా సరే పవన్ కళ్యాణ్ కు మాత్రం దేశవ్యాప్తంగా మంచి ఫ్యాన్ బేస్ ఉంది. 90లలో సూపర్ స్టార్ కృష్ణ సొంతం చేసుకున్న ఇమేజ్ ను నేడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే ఇమేజ్ను సొంతం చేసుకున్నారు. టాలీవుడ్ లో అత్యధిక మార్కెట్ ఉన్న హీరోల లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మొదటి స్థానంలో ఉంటారు. ఇక పవన్ కళ్యాణ్ సినిమాలు వస్తున్నాయంటే చాలు థియేటర్ల ముందు రెండు మూడు రోజులకు ముందే ఆయన అభిమానులు నానా హంగామా చేస్తూ ఉంటారు.
కథ పరంగా ప్రేక్షకులను మెప్పించక పోయినప్పటికీ కేవలం పవన్ కళ్యాణ్ అభిమానులు ఆ సినిమా కమర్షియల్ గా విజయం చేస్తూ ఉంటారు. ముఖ్యంగా ఈయన సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద ఊహించని స్థాయిలో ఓపెనింగ్స్ ను అందుకుంటాయి. సక్సెస్ ఫెయిల్యూర్ తో సంబంధం లేకుండా బాక్సాఫీస్ వద్ద ఒకే తరహా మార్కెట్ మెయింటెన్ చేస్తూ వస్తున్నారు పవన్ కళ్యాణ్. ఇంత మార్కెట్ ను సొంతం చేసుకున్న పవన్ కళ్యాణ్ పారితోషికం విషయంలో కూడా అంతే డిమాండ్ చేస్తూ అనడంలో సందేహం లేదు. ఇకపోతే పవన్ కళ్యాణ్ తాజాగా సముద్రఖని దర్శకత్వంలో ఒక తమిళ్ సినిమాలో నటించడానికి త్రివిక్రమ్ సలహా మేరకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం.
ఈ సినిమాలో సాయి ధరంతేజ్ కూడా ముఖ్య పాత్రలో కనిపిస్తున్నాడు అని కథనాలు వెలువడుతున్నాయి.ఇదిలా ఉండగా ఈ సినిమా కోసం పవన్ కళ్యాణ్ కేవలం 30 రోజుల్లోనే సినిమా షూటింగ్ షెడ్యూల్ పాల్గొనే విధంగా ప్లాన్ చేసినట్లు సమాచారం. ఇక త్వరలో మొదలు కాబోతున్న ఈ సినిమా షూటింగ్ కోసం ఆయన ఏకంగా 60 కోట్ల రూపాయలను తీసుకుంటున్నారట. అంటే ఒక్క రోజు పారితోషికం ఏకంగా 2 కోట్ల రూపాయలు అని తెలుస్తోంది. ఇక పవన్ కళ్యాణ్ ఒక్కరోజు పారితోషకం చూసి సినీ ఇండస్ట్రీ మొత్తం షాక్ లో ఉండిపోయింది అని చెప్పవచ్చు.