ప్రధాని అలాంటి డ్రెస్ వేసుకోకూడదా.. ట్రోల్స్ ని వ్యతిరేకిస్తున్న జనాలు..

-

ఫిన్ లాండ్ ప్రధాని సానా మారిన్ పై విపరీతంగా ట్రోల్స్ వచ్చాయి. ఒకానొక మ్యాగజైన్ కోసం చేసిన ఫోటోషూట్లో, ఆమె వేసుకున్న బ్లేజరే అందుకు కారణం అయ్యింది. మరీ లో నెక్ కలిగిన బ్లెజర్ ని ధరించడంతో ఆ దేశ ప్రజలు ట్రోల్స్ చేస్తున్నారు. ప్రధానివై ఉండి ఇలాంటి డ్రెస్ వేసుకుంటారా అని విపరీతంగా ట్రోల్స్ చేసారు. ఐతే ఇలా ఒకవైపు ట్రోల్స్ జరుగుతుంటే మరో వైపు సానా మారిన్ కి మద్దతు పెరుగుతుండడం ఆశ్చర్యకరం.

సానా మారిన్ వయసు 34సంవత్సరాలు మాత్రమే. అలాంటి బ్లేజర్ వేసుకుంటే తప్పేంటి అంటూ, ఆమెకి మద్దతుగా అలాంటి బ్లేజర్ వేసుకుని, సోషల్ మీడియాలో పెడుతున్నారు. మెల్ల మెల్లగా మద్దతు పెరుగుతూనే ఉంది. మరి ఇలాంటి టైమ్ లో ట్రోలర్స్ ఏమంటారో..!

Read more RELATED
Recommended to you

Exit mobile version