డ్రగ్స్ కేసులో డైరెక్టర్ క్రిష్ పై FIR

-

రాడిసన్ డ్రగ్స్ కేసులో రోజురోజుకు సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా టాలీవుడ్ డైరెక్టర్ క్రిష్ డ్రగ్స్ పార్టీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. FIR లో ఎనిమిదవ నిందితుడిగా కృషుని చేర్చారు. క్రిష్ స్టేట్మెంటు తీసుకోనున్నారు.. కాగా తమ సన్నిహితులు పిలవడం వల్లనే పార్టీకి వెళ్లానని తెలిపారు. డ్రైవరు రాగానే అక్కడి నుంచి వెళ్ళిపోయినట్టు క్రిష్ వెల్లడించారు. బిజెపి నేత కుమారుడు అయిన వివేకానంద రాడ్ సన్ హోటల్లో డ్రగ్స్ పార్టీ ఇచ్చారు.

దాదాపు అరగంట సేపు రాడిసన్ హోటల్లో వివేకానంద తో డైరెక్టర్ క్రిష్ మాట్లాడినట్టు తెలుస్తోంది. దీనిపై పోలీసులు విచారణ చేపడుతున్నారు. రాడిసన్ డ్రగ్స్ కేసులో కృష్ణకు ఏమైనా సంబంధం ఉందా లేదా అనే కోణంలో ఆరా తీస్తున్నారు.  మరోవైపు ఫ్రెండ్స్ ని కలవడానికి వెళ్లాను. సాయంత్రం అక్కడ అరగంట మాత్రమే ఉన్న పోలీసులు నన్ను ప్రశ్నించారు అని మీడియా ప్రతినిధికి సమాధానం ఇచ్చాడు క్రిష్. ఎందుకు వెళ్లానో, ఎవరిని కలిశానో పోలీసులకు స్టేట్మెంట్ ఇచ్చినట్టు తెలిపారు డైరెక్టర్ క్రిష్.

Read more RELATED
Recommended to you

Latest news