గజ్వేల్ లో భారీ అగ్నిప్రమాదం..50కోట్ల ఆస్తి నష్టం..!

సిద్దిపేట జిల్లా గజ్వేల్ లో నిన్న రాత్రి భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదం లో భారీగా ఆస్తినష్టం జరిగినట్టు అధికారులు భావిస్తున్నారు. గజ్వేల్ పట్టణం లో ట్రాన్స్ ఫార్మర్ మరమ్మత్తు కేంద్రం లో ఈ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ట్రాన్స్ ఫార్మర్ మరమ్మత్తు కేంద్రం లో మంటలు చెలరేగి భారీగా అగ్ని కిలలు ఎగసిపడ్డాయి. దాంతో స్థానికులు వెంటనే ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు.

అగ్ని మాపక సిబ్బంది వెంటనే అక్కడకు చేరుకుని మంటలు అదుపుచేసెందుకు ప్రయత్నించారు. అయితే ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉండటం వల్ల మంటలు అదుపు చేయడానికి ఎక్కువ సమయం పట్టింది. ఈ ప్రమాదం లో భారీగా ఆస్తినష్టం జరిగినట్టు అధికారులు అంచనా వేస్తున్నారు. దాదాపుగా 50 కోట్ల రూపాయల వరకు అస్తి నష్టం జరిగిందని అంచనా వేశారు. షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగి ఉంటాయని అధికారులు భావిస్తున్నారు.