తెలంగాణ రాష్ట్ర మున్సిపల్ చైర్మన్ చాంబర్లో ఘోర అగ్నిప్రమాదం సంభవించింది. శుక్రవారం ఉదయం హిమాయత్ నగర్‌లోని స్టేట్ మున్సిపల్ చైర్మన్ చాంబర్ భవనంలో షాట్ సర్క్యూట్ కారణంగా ఈ ప్రమాదం సంభవించినట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదం కారణంగా చాంబర్స్‌లోని ఫర్నీచర్, సంబంధిత ఫైల్స్ తదితర సామగ్రి పూర్తిగా దగ్ధమయ్యాయి.
అగ్నిమాపక సిబ్బంది శ్రమించి మంటలను అదుపులోకి తీసుకురాగా.. సమాచారం అందిన వెంటనే మున్సిపల్ ఛాంబర్ రాష్ట్ర చైర్మన్ వెన్ రెడ్డి రాజు భవనాన్ని సందర్శించి పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉమ్మడి ఏపీలో చైర్మన్లు సొంత నిధులతో నిర్మించుకున్న భవనం పురపాలికలో విప్లమాత్మక మార్పునకు వేదిక అయ్యిందన్నారు. సమర్థవంతమైన పాలన, చైర్ పర్సన్ల సమస్యలు మెరుగైన పురపాలికకు సంబంధించి అనేక అంశాలకు దిక్సూచిగా నిలిచాయన్నారు. ఎంతో చరిత్ర కలిగిన ఈ చాంబర్‌లో అగ్నిప్రమాదం జరగడం బాధేసిందన్నారు. సీఎం రేవంత్, మంత్రి కోమటిరెడ్డి చాంబర్ ఆధునీకరణకు రూ.కోటి కేటాయించారన్నారు.