సముద్రం ఈ పదం వినగానే అందరికీ పెద్ద, పెద్ద అలలు గుర్తుకు వస్తాయి. చుట్టూ నీళ్లే.. అసలు చివరి భాగం ఎక్కడుందో తెలిదు. అసలు.. సముద్రం గురించి ఒక్క మాటలో ఏం చెప్పగలం. అయితే.. అలాంటి సముద్రం ఒక్కసారి మంటలు చెలరేగాయి. అవును.. నడి సముద్రంలో మంటలు ఎగిసిపడ్డాయి. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఓ వీడియో.. సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వివరాల్లోకి వెళితే..
మెక్సికోలోని యూకాటన్ ద్వీపకల్పంలో పెమెక్స్ అనే చమురు సంస్థ ఉంది. ఆ కంపెనీ రోజు వారీగా దాదాపు 1.7 మిలియన్ బారెల్స్ చమురు ను ఉత్పత్తి చేస్తోంది. అయితే.. మెక్సికోలో భారీగా కురుస్తున్న వర్షాల వల్ల చమురు యంత్రాలు దెబ్బతిన్నాయి. అలాగే సముద్ర లోపలి నుంచి చమురును రవాణా చేసే పైప్‌లైన్ దెబ్బతింది. దీంతో గ్యాస్ లీకై.. మంటలు అంటుకున్నాయి.
అయితే.. ఈ ప్రమాదం ఉదయం 5.15 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంపై వెంటనే స్పందించిన సిబ్బంది.. నౌకలతో మంటలపై నీటిని చల్లి పూర్తిగా అదుపులోకి తీసుకువచ్చారు. అయితే.. దీనికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.