ములుగులో కాల్పుల కలకలం.. డ్యూటిలో ఉన్న ఎస్ఐ మృతి

-

ములుగు జిల్లా లో దారుణం చోటు చేసుకుంది. ములుగు జిల్లా వెంకటాపురం పోలీస్ స్టేషన్ లో కాల్పులు కలకలం రేపాయి. మండల కేంద్రంలోని 39 సిఆర్పిఎఫ్ బెటాలియన్ సమావేశం ఆదివారం ఉదయం జరిగింది. అయితే బెటాలియన్ లోని స్టీఫెన్, ఎస్సై ర్యాంకు అధికారి ఉమేష్ చంద్ర అనే జవాన్ల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. దీంతో రెండు రౌండ్ల కాల్పులు చోటు చేసుకున్నాయి.

సి ఆర్ పి ఎఫ్ ఎస్ ఐ ఉమేష్ చంద్ర మరియు కానిస్టేబుల్ స్టీఫెన్ కు మధ్య గొడవ జరగడంతో కాల్పులు జరుపుకున్నారు. ఈ కాల్పుల్లో ఎస్సై ఉమేష్ చంద్ర స్పాట్లోనే మృతి చెందాడు. అంటూ కానిస్టేబుల్ స్టీఫెన్ కు కూడా తీవ్ర గాయాలు అయ్యాయి. దీంతో స్టీఫెన్ ను ఏటూరునాగారం ఏరియా ఆస్పత్రికి తరలించారు అధికారులు. మెడ దగ్గర గొడవ పడి ఒకరి పై ఒకరు కాల్పులు జరుపుకున్నారు. కాగా ఉమేష్ చంద్ర సొంతూరు బీహార్ కాగా… స్టీఫెన్ ఇది కన్యాకుమారి అని తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news