కరీంనగర్ ప్రజలకు గుడ్ న్యూస్ : 183 కోట్లతో కేబుల్ బ్రిడ్జి ఏర్పాటు

-

తెలంగాణ లో బ్యూటీవుల్ రివర్ మానేరు ఉండనుందని.. చెక్ డ్యామ్ లు వరదల వల్ల డ్యామేజి అయ్యాయి..ఆ ప్రాంతంలో డిజైన్ మార్చి మరలా కట్టనున్నామని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. కరీంనగర్ కు మణిహారంగా 183 కోట్లతో కేబుల్ బ్రిడ్జి ఏర్పాటు అయిందని.. కమాన్ నుండి కేబుల్ బ్రిడ్జి వరకు 40 కోట్లతో రోడ్డు నిర్మాణం సెంట్రల్ లైటింగ్ తో నిర్మాణాలు జరుగుతున్నాయని చెప్పారు. కేబుల్ బ్రిడ్జి వద్ద ఇండియాలో మొదటగా 6 కోట్లతో డైనమిక్ లైట్లు ఏర్పాటు అవుతుందని.. రైతులకు సర్వీస్ రోడ్డు ఇతర సదుపాయాలకు 7 కోట్లు ఖర్చు చేస్తున్నామన్నారు.

మూడు నెలల్లో కేబుల్ బ్రిడ్జి పూర్తి స్థాయిలో సిద్ధం అవుతుందని.. కరీంనగర్ టు సిరిసిల్ల రోడ్ అద్భుతంగా తయారవుతుందని వెల్లడించారు. కాకతీయ కెనాల్ పై ఒక బ్రిడ్జి మరో బ్రిడ్జి రెండు 30 కోట్లతో నిర్మాణం అవుతున్నాయని.. ఎన్నికలు అవ్వగానే కరీంనగర్ అభివృద్ధి పైనే దృష్టి పెట్టామని చెప్పారు. 350 నిధులు అభివృద్ధి కి కేటాయించగా 100 కోట్ల పనులు ఇప్పటికే పూర్తి ఆయ్యాయి.మరికొన్ని పనులు త్వరలోనే జరగనున్నాయని.. కరీంనగర్ జిల్లా అభివృద్ధికే పాటుపడతామన్నారు. ఢిల్లీ మేము బిచ్చగాళ్ల లాగా పోలేదని.. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలపై చిన్న చూపు చూస్తున్నాయని వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Latest news