హనుమాన్ మూవీ కి ఫస్ట్ అవార్డు వచ్చేసింది..!

-

ప్రశాంత్ వర్మ తేజ సజ్జ కాంబినేషన్లో వచ్చిన హనుమాన్ సినిమా పెద్ద హిట్ అయిన విషయం తెలిసిందే. ఈ ఏడాది సంక్రాంతి కానుక గా వచ్చిన ఈ సినిమా సూపర్ హిట్ని అందుకుంది. ఎటువంటి అంచనాలు లేకుండా వచ్చిన ఈ మూవీ పెద్ద పెద్ద హీరోల సినిమాలకి సైతం గట్టి పోటీని ఇచ్చి బాక్స్ ఆఫీస్ వద్ద భారీ కలెక్షన్స్ ని రాబట్టింది. ఓటీటీలో కూడా రిలీజ్ అయింది.

ఇప్పుడు దూసుకు వెళ్తోంది. ప్రశాంత్ వర్మ కి హనుమాన్ మూవీకి బెస్ట్ డైరెక్టర్ అవార్డు వచ్చింది. దర్శకుడు ప్రశాంత్ వర్మ ఇంస్టాగ్రామ్ వేదికగా తన ఆనందాన్ని అభిమానులతో పంచుకున్నారు. థాంక్యూ రేడియో సిటీ అంటూ క్యాప్షన్ కూడా ఇచ్చారు. ఈ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇది చూసిన వాళ్ళందరూ ముందు ముందు ఇంకా ఎన్నో అవార్డులు వస్తాయని కామెంట్లు చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news