కాసేపటి క్రితం వైసీపీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు మీడియాతో మాట్లాడుతూ టీడీపీ మరియు చంద్రబాబు నాయుడు గురించి కొన్ని వాస్తవాలను బయటపెట్టాడు. ఈ సందర్భంగా విష్ణు మాట్లాడుతూ చంద్రబాబు ప్రజలకు రెండు సెంట్ల స్థలాలు ఇచ్చామని ప్రచారం చేసుకుంటున్నారు. ఇక్కడ ఇచ్చారు ? ఎవరికి ఇచ్చారో వివరాలు చెప్పాలని డిమాండ్ చేశారు. చంరబాబు ఇవ్వకుండా ప్రజలను మోసం చేసిన విషయం తెలిసి ఇప్పుడు మా ప్రభుత్వం పేదలు కనీసం అద్దె కట్టుకోవడానికి కూడా ఇబ్బంది పడకూడదని మంచి ఆలోచనలో రాష్ట్ర వ్యాప్తంగా 30 లక్షల మందికి ఇంటి స్థలాలను ఇచ్చారని చెప్పారు. వీటిని ఆపడానికి ఎంతో ప్రయత్నించి చంద్రబాబు ఫెయిల్ అయ్యాడు అని విష్ణు బట్టబయలు చేశాడు.