కరీంనగర్ లో తొలి కరోనా పాజిటివ్ కేసు నమోదు అయింది. కరోనా బాదితుడ్ని అక్కడి నుంచి హైదరాబాద్ గాంధీ ఆస్పత్రికి తీసుకొచ్చారు అధికారులు. ఇండోనేషియ బృందం పర్యటించిన చోట అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. కరోనా బాదితుడ్ని కలిసిన వ్యక్తులు… ఆస్పత్రులకు వచ్చి పరిక్షలు చేయించుకోవాలి అని కలెక్టర్ సూచించారు. కరీంనగర్ లో తొలి కరోనా పాజిటివ్ కేసు నమోదు కావడంతో ప్రజల్లో ఆందోళన వ్యక్తమవుతుంది.
దయచేసి ప్రజలు ఎవరూ ఇళ్ళ నుంచి బయటకు రావొద్దని అధికారులు హెచ్చరించారు. కరోనా బాధితుడు ఉన్న ప్రాంతంలో ప్రత్యేక శానిటేషన్ చేసారు అధికారులు. దీనితో తెలంగాణాలో కరోనా బాధితుల సంఖ్య 28 కి చేరిందని అధికారులు ప్రకటించారు. అయితే ఆ వ్యక్తి ఎవరూ అనేది మాత్రం స్పష్టత లేదు. అతనికి ఏ విధంగా కరోనా సోకిందో కూడా అధికారులకు అర్ధం కావడం లేదు.
దీనిపై విచారణ కూడా చేపట్టారు. ఇండోనేషియ బృంద౦ తో అతను ఏమైనా కలిసాడా…? లేక అతను ఎక్కడికి అయినా వెళ్లి వచ్చాడా అనేది అధికారులు ఆరా తీస్తున్నారు. అతను ఎక్కడ ఎక్కడ తిరిగారు అనే దాని మీద కూడా ఆరా తీస్తున్నారు. కరీంనగర్ లో పరిస్థితి అదుపులోనే ఉందని ప్రజలు ఎవరూ బయటకు రావొద్దని, కంగారు పడాల్సిన అవసరం లేదని అధికారులు సూచించారు.