ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. బ్యారేజ్‌లో 11.75 అడుగులకు నీటిమట్టం చేరింది. 175 గేట్లను ఎత్తి సుమారు 10 లక్షల క్యూసెక్కుల నీరు విడుదల చేస్తున్నారు. ఎగువ నుంచి భారీగా వస్తున్న ప్రవాహంతో గోదావరి నీటిమట్టం మరింత పెరిగే అవకాశం ఉంది.

గోదావరి ఉగ్రరూపంతో లంక గ్రామాలు ప్రభావితమవుతున్నాయి. రాజమండ్రి పరిసర లంకల్లో నివసిస్తున్న 300 మంది మత్స్యకారులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. అటు భారీ వర్షాల నేపథ్యంలో గోదావరి నది ఉధృతంగా ప్రవహిస్తోంది. ముఖ్యంగా భద్రాచలం వద్ద గోదావరి ప్రమాదకరంగా ప్రవహిస్తోంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు అధికారులు. అయినప్పటికీ క్రమక్రమంగా గోదావరి… వరద పెరుగుతూనే ఉంది. ఇప్పటివరకు గోదావరి నీటిమట్టం 48 అడుగులు దాటింది. 53 అడుగులు చేరితే మూడవ ప్రమాద హెచ్చరిక జారీ చేస్తారు.