కాంగ్రెస్ పార్టీ బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ వివాదంలో చిక్కుకున్నారు. ఆయన పిఏలు చేసిన పనికి బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ తలదించుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ కు సంబంధించిన ఇద్దరు పీఏ లు అలాగే అనుచరులు మందు తాగుతూ నడిరోడ్డు మీద హల్చల్ చేశారు. బెల్లంపల్లి కెమికల్ ఏరియాలో జాతీయ రహదారిపై చిందులేస్తూ వహంగా సృష్టించారు.

దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు బయటకు వచ్చింది. దీనిపై సోషల్ మీడియాలో దారుణంగా ఫైర్ అవుతున్నారు జనాలు. కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత… ఆ పార్టీకి సంబంధించిన వ్యక్తులు విచ్చలవిడిగా రోడ్లపై తాగి చిందులు వేస్తున్నారని మండిపడుతున్నారు. మరి ఈ సంఘటనపై బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి. ఇద్దరు pa లపై యాక్షన్ తీసుకుంటారా లేదా అనేది తెలియాల్సి ఉంది.
ఇందిరమ్మ రాజ్యంలో ఇష్టారాజ్యంగా కాంగ్రెస్ నేతల ఆగడాలు
బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ ఇద్దరు పీఏలు, అనుచరులు మందు తాగుతూ నడిరోడ్డు మీద హల్చల్
బెల్లంపల్లి కెమికల్ ఏరియాలో జాతీయ రహదారిపై చిందులేస్తూ హంగామా pic.twitter.com/A5t0ZMaqDM
— Telugu Scribe (@TeluguScribe) August 21, 2025