నక్సల్ గా రానా.. అదరకొట్టిన ఫస్ట్ లుక్

-

ఈ రోజు రానా దగ్గుబాటి పుట్టిన రోజు అన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆయన నటిస్తున్న సినిమాల నుంచి అభిమానుల కోసం స్పెషల్ సర్ప్రైజ్ గిఫ్ట్ లు ఇస్తున్నారు మేకర్స్. ప్రస్తుతం రానా హీరోగా సాయి పల్లవి హీరోయిన్ గా నీది నాది ఒకే కథ ఫిలిం దర్శకుడు వేణు దర్శకత్వంలో విరాట పర్వము అనే సినిమా తెరకెక్కుతోంది.. ఈ సినిమాకు సంబంధించి ఫస్ట్ లుక్ కొద్ది సేపటి క్రితం రిలీజ్ అయింది. ఈ ఫస్ట్ లుక్ లో ప్రఆయన ఒక నక్సలైట్ యోధుడిగా కనిపిస్తున్నాడు.

- Advertisement -

ఇది ముందు నుంచి ఈ సినిమా నక్సలిజం నేపథ్యంలో తెరకెక్కుతున్నట్లు ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో రానాతో పాటు ప్రియమణి, జరీనా వాహబ్, నందితా దాస్, నివేదా పేతురాజ్, నవీన్ చంద్ర వంటి వాళ్లు కీలక పాత్రలలో నటిస్తున్నారు. ఈ సినిమాని సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ సమర్పిస్తూ ఉండగా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమా బ్యానర్ మీద సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. ఇక ఫస్ట్ లుక్ కాకుండా మరికాసేపట్లో సినిమా నుండి గ్లిమ్ప్జ్ కూడా రిలీజ్ చేస్తామని యూనిట్ ప్రకటించింది. అది ఇంకా ఎంత ఆశక్తి రేపుతుందో వేచి చూడాలో.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

జీతం అడిగితే నోటితో చెప్పులు మోయించారు…!

సమాజంలో నేడు పరిస్థితులు ఎలా ఉన్నాయంటే కష్టపడి నెలంతా పనిచేసినా కానీ...

ఢమాల్: కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు…అన్ని రంగాలు డౌన్ !

విజయదశమి రోజున ముదుపర్లకు భారీగా నష్టాలు వచ్చినట్లుగా తెలుస్తోంది. ఈ రోజు...