తెలంగాణ పంచాయతీ ఎన్నికల తొలి విడత పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. సోమవారం ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ మధ్యాహ్నం ఒంటి గంట వరకు కొనసాగింది. నిర్ణీత సమయం వరకు పోలింగ్ బూత్ వద్ద క్యూలో ఉన్నవారికి సైతం ఓటు వేసే అవకాశం కల్పించారు. దీంతో మొదటి విడత ఎన్నికలు జరిగే 4,479 పంచాయతీల్లో 769 పంచాయతీలు.. 39,822 వార్డుల్లో 10,654 వార్డులు ఏకగ్రీవమయ్యాయి.
మిగిలిన 3,701 పంచాయతీలు, 28,976 వార్డులకు ఎన్నికలు జరిగాయి. 12 గంటల సమయానికి రాష్ట్ర వ్యాప్తంగా 75 శాతం పోలింగ్ నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. మధ్యాహ్నం 2 గంటలకు తర్వాత ప్రారంభమైన పంచాయతీ ఎన్నికల ఓట్ల లెక్కింపులో తెరాస మద్దతు ప్రకటించిన అభ్యర్థులు విజయం దిశగా దూసుకెళ్తున్నారు.