గతంలో వరుసగా జరిగిన రెండు ఎన్నికలలోనూ కేసీఆర్ సారథ్యంలోని BRS పార్టీ విజయం సాధించి తమకు ఎదురులేదని నిరూపించారు. కానీ ప్రస్తుతం కేసీఆర్ గెలవడానికి చాలా కష్టం అని తెలుస్తోంది. ఎందుకంటే ఒకవైపు కాంగ్రెస్ మరోవైపు బీజేపీలు కేసీఆర్ ను ఓడించాలన్న కసితో రగిలిపోతున్నాయి. ఇక సర్వే లు అన్నీ కూడా కాంగ్రెస్ వైపే మొగ్గు చూపుతున్నాయి. ఒకవేళ ప్రజలు మరోసారి కేసీఆర్ ను ఆశీర్వదిస్తే మొదటి సంతకం దేనిపైనా పెడతారని అందరూ ఆలోచిస్తూ ఉంటారు.. అందుకు సమాధానంగా అసైన్డ్ భూములపై రైతులకు పూర్తి హక్కును కలిగించేలా నిర్ణయం తీసుకుంటూ మొదటి సంతకం ఫైల్ పై పెడతారని ఇప్పటికే చెప్పి ఉన్నారు. ఈ విషయాన్ని దుబ్బాక నియోజకవర్గంలో బహిరంగ సభలో హామీని ఇచ్చారు కేసీఆర్.
మరి కేసీఆర్ హ్యాట్రిక్ సీఎం అయ్యే రాత ఉందా ? అసలు ఏమి జరగనుంది అన్నది తెలియాలంటే డిసెంబర్ 3 వరకు వేచి చూడాల్సిందే. కాగా రేపు ఉదయం 6 గంటలకు అన్ని నియోజకవర్గాలలో ఓటింగ్ మొదలు కానుంది.