అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ లీడ్‌లోనే కొనసాగుతున్నారు. మరికొద్ది సేపట్లో అగ్రరాజ్యానికి కాబోయే అధ్యక్షుడు ఎవరో తేలిపోనుంది. ఈ క్రమంలోనే డెలవేర్‌లోని ఎట్ లార్జ్ హౌస్ డిస్ట్రిక్ట్ నుంచి డెమోక్రటిక్ అభ్యర్థిగా సారా మెక్‌బ్రైడ్ విజయం సాధించారు. దీంతో అమెరికా కాంగ్రెస్‌కు ఎన్నికైన తొలి ట్రాన్స్‌జెండర్‌గా సారా రికార్డు క్రియేట్ చేశారు. రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి జాన్ వేలెన్- 3తో పోటీ పడగా.. సారాకు 95 శాతం ఓట్లు పోలవగా.. ప్రత్యర్థికి 57.9 శాతం ఓట్లు పోలయ్యాయి.
గెలుపు అనంతంర సారా మాట్లాడుతూ.. తాను విజయం కోసం పోటీ చేయలేదని, డెలవేర్లో మార్పు కోసమే పోటీ చేసినట్లు పేర్కొన్నారు. సారా మెక్ బ్రైడ్ ఎల్జీబీటీక్యూ జాతీయ కార్యకర్తగానూ వ్యవహరిస్తున్నారు. ఎన్నికల టైంలో దాదాపు 3 మిలియన్లకుపైగా ప్రచార విరాళాలు సేకరించారు. 2016లో డెమోక్రటిక్ నేషనల్ కన్వెన్షన్‌లో ప్రసంగించిన తొలి ట్రాన్స్‌జెండర్‌గా గుర్తింపు పొందిన సారా.. 2020లో డెలవేర్లో తొలి ట్రాన్స్ స్టేట్ సెనెటర్‌గా ఉన్నారు.