Nagarjuna: మ‌న్మ‌ధుడా మజాకా! ఏకంగా ఐదుగురు హీరోయిన్ల‌తో రొమాన్స్‌!

-

Nagarjuna: టాలీవుడ్ మన్మథుడు అక్కినేని నాగార్జున(Nagarjuna). 60 ఏండ్లకు పైబ‌డిన న‌వ మ‌న్మ‌ధుడుగానే క‌నిపిస్తారు. ఇప్ప‌టికీ అమ్మాయిలో కింగ్ నాగ్ క్రేజ్ ఏమాత్రం త‌గ్గ‌లేదు. కుర్ర హీరోల‌కు ఏ మాత్రం త‌గ్గ‌కుండా ఇటు సినిమాలు, అటు టీవీ షోలు అంటూ బిజీబిజీగా ఉంటారు. ప్రస్తుతం ఆయన కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో ‘బంగార్రాజు’ అనే సినిమా చేస్తున్నారు. ఈ సినిమా సోగ్గాడే చిన్నినాయనా సినిమాకు సీక్వెల్‌గా తెరకెక్కుతుంది. గ‌తంలో రొమాంటిక్ ఎంటర్టైనర్ గా వ‌చ్చిన సోగ్గాడే చిన్ని నాయ‌నా ఎంత‌టి విజ‌యం సాధించిందో చెప్ప‌వ‌ల్సినవ‌స‌రం లేదు. ఆ ఘ‌న విజ‌యంతో.. అప్పటి నుంచి ఈ సినిమాకు సీక్వెల్ చేయాలని కింగ్ నాగ్ భావించారు.

కానీ క‌రోనా కార‌ణంగా ఈ సినిమా షూటింగ్ వాయిదా పడుతూ వచ్చింది. మ‌రోవైపు కింగ్ నాగార్జున అటు సినిమాలతో ఇటు టీవీషోలతో ఫుల్ బిజీగా ఉన్నారు. దీంతో కాస్త వెనుక‌బ‌డింది. అయితే ప్రస్తుతం పరిస్థితులు మామూలుగా మారిపోవడంతో.. ఈ సినిమా షూటింగ్ యధావిథిగా కొనసాగుతోంది. ఈ చిత్రంలో నాగ‌ర్జునతో పాటు అక్కినేని యంగ్ హీరో నాగ చైతన్య కూడా నటిస్తున్నాడు. సోగ్గాడే చిన్ని నాయనా సినిమాలో తండ్రి కొడుకులుగా డియ‌ల్ రోల్ చేసి నాగార్జున ఆక‌ట్టుకున్నారు.

అయితే.. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ వార్త నెట్టింట్లో వైర‌లవుతుంది. ఈ సినిమాలో ఒక పాటలో నాగార్జున ఏకంగా ఐదుగురు హీరోయిన్లతో రొమాన్స్ చేయ‌నున్నార‌ట‌. ఈ పాత్ర‌ల కోసం ముగ్గురు ముద్దుగుమ్మలను ఎంపిక చేశారట.. వీరిలో బిగ్ బాస్ హాట్ బ్యూటీ మోనాల్, మెనాల్ గజ్జర్, మీనాక్షి చౌదరి ఉంటుందని టాక్. ఇంకా ఇద్ద‌రు అందగత్తెలు ఎవ‌ర‌న్న‌ది తెలియాల్సింది.

ఇప్పటికే ఈ సినిమాలో నాగార్జున సరసన రమ్యకృష్ణ హీరోయిన్‌గా నటిస్తున్న విష‌యం తెలిసిందే. సోగ్గాడే చిన్ని నాయన సినిమాలో లాగా.. ఈ చిత్రంలో స్వర్గం సన్నివేశాలు ఉంటాయని తెలుస్తోంది. బంగార్రాజు భూమి మీదకు వచ్చిన తర్వాత కూడా స్వర్గం నుండి వచ్చిన రంభ ఊర్వసి మేనకలు ఆయన వెంట ఉంటారట. అలాగే నాగచైతన్యకు జోడీగా లేటెస్ట్ సెన్సేషన్ కృతిశెట్టి నటిస్తున్న‌ట్టు తెలుస్తుంది. అయితే దీనిపై ఎలాంటి అధికారికంగా సమాచారం లేదు.

Read more RELATED
Recommended to you

Latest news