రైతు భీమా: అన్నదాతల కుటుంబానికి రూ.5 లక్షల ఇన్సూరెన్స్… అర్హత, అప్లికేషన్ ప్రాసెస్ మొదలైన వివరాలివే..!

-

రైతుల కోసం కేంద్రం ఎన్నో రకాల స్కీమ్స్ ని తీసుకు వచ్చింది. అలానే రైతుల కోసం తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తోన్న పథకాలలో రైతు బీమా కూడా ఒకటి. ఈ రైతు బీమా వలన రైతులు ఎవరైనా అనుకోని ప్రమాదం వల్ల మరణిస్తే వాళ్ళ కుటుంబానికి రూ.5 లక్షల ఆర్థిక సాయాన్ని ప్రభుత్వం ఇస్తుంది.

ఇక మరి దీని కోసం పూర్తి వివరాల లోకి వెళితే.. రైతు బంధు పథకానికి అర్హులైన రైతులందరూ కూడా రైతు బీమా పథకాన్ని పొందవచ్చు. ఇక మరి రైతు బంధు పథకానికి సంబంధించి పూర్తి వివరాల లోకి వెళితే.. ఈ పధకం కి సంబంధించి ఎలాంటి లోటు లేకుండా ఉండేందుకు రాష్ట్ర ప్రభుత్వం తాజా బడ్జెట్‌లో రూ.24,254 కోట్లను కేటాయించింది.

రైతు బంధు పథకానికి ఉండాల్సిన అర్హతలు:

ఈ రైతు బీమా పథకానికి దరఖాస్తు చేసుకోవాలి అంటే రైతు వయస్సు 18 నుంచి 59 ఏళ్ల మధ్యలో ఉండాలి. ఏజ్ ప్రూఫ్ కోసం ఆధార్ ని సబ్మిట్ చెయ్యాల్సి ఉంటుంది.
అలానే ఊరిలో ఉన్న భూములకు మాత్రమే ఈ బీమా వర్తిస్తుంది.
రైతే స్వయంగా వెళ్లి నామినేషన్ ఇవ్వాలి.
రైతులు భూమికి సంబంధించిన పాస్ పుస్తకం, ఆధార్ కార్డు, నామినీ ఆధార్ కార్డు జిరాక్స్ ని తప్పక సబ్మిట్ చెయ్యాల్సి వుంది.
దరఖాస్తుదారుడు తెలంగాణ రాష్ట్రానికి చెందిన వారై ఉండాలి. అలానే పర్మినెంట్ రెసిడెంట్ అయి ఉండాలి.
సొంత వ్యవసాయ భూమి కలిగి ఉండాలి.
కౌలుకి తీసుకుని పంట పండించే వారికి ఈ స్కీమ్ అవ్వదు.

ఇక దీని కోసం ఎలా అప్లై చెయ్యాలి అనేది చూస్తే.. రైతు బీమా పథకానికి చెందిన మొబైల్ అప్లికేషన్ కూడా అందుబాటులో ఉంది. ఈ అప్లికేషన్‌ ద్వారా తేలికగా స్కీమ్ వివరాలను పొందొచ్చు. అధికారిక వెబ్‌సైట్ ద్వారా దీన్ని మనం పొందొచ్చు.

అధికారిక వెబ్‌సైట్‌లోకి వెళ్లి పేజీలో కనిపించే డౌన్‌లోడ్ మొబైల్ యాప్‌పై క్లిక్ చేయాలి. ఇలా మీరు మీ ఫోన్‌లో ఈ అప్లికేషన్‌ను డౌన్‌లోడ్ చేసుకుని, ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు. జిల్లాకు చెందిన నోడల్ ఆఫీసర్‌ను కలిసి కానీ 040 2338 3520 కాల్ చేసి కానీ పూర్తి సమాచారం తెలుసుకోచ్చు.

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version