గ్రీస్ దేశాన్ని ఆకస్మిక వరదలు ఒక్కసారిగా ముంచెత్తాయి. గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా గ్రీక్ ఐలాండ్ పరోస్ పూర్తిగా జలమయమైంది. దీంతో జనజీవనం ఒక్కసారిగా స్తంభించిపోయింది. భారీ వరదలు, వర్షాల కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
అయితే, వరద ఉధృతికి పలు వాహనాలు కొట్టుకుపోయినట్లు సమాచారం. ప్రకృతి విలయం కారణంగా విద్యా సంస్థలకు గ్రీస్ ప్రభుత్వం సెలవు ప్రకటించింది. ఇక అనవసరపు ప్రయాణాలు చేయొద్దని ప్రజలకు ప్రభుత్వ అధికారుల సూచన చేశారు. అయితే, మరో వారం రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని గ్రీస్ వాతావరణ సంస్థ పేర్కొనట్లు తెలిసింది.కాగా, వరదల కారణంగా నిరాశ్రయులైన వారికి సహాయక బృందాలు సాయం చేస్తున్నాయి.
గ్రీస్ ను ముంచెత్తిన ఆకస్మిక వరదలు..
భారీ వర్షాలతో జలమయమైన గ్రీక్ ఐలాండ్ పరోస్
వరద ఉధృతికి కొట్టుకుపోయిన వాహనాలు
విద్యా సంస్థలకు సెలవు ప్రకటన.. ప్రయాణాలు చేయొద్దని ప్రజలకు ప్రభుత్వ అధికారుల సూచన
మరో వారం రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం pic.twitter.com/8pv2rk7E3s
— BIG TV Breaking News (@bigtvtelugu) April 1, 2025