ఢిల్లీ- దోహా ఫ్లైట్ ఎమర్జెన్సీ… అత్యవసరంగా పాకిస్తాన్ కరాచీలో ల్యాండింగ్

-

ఢిల్లి నుంచి దోహా వెళ్లే విమానానికి త్రుటిలో ప్రమాదం తప్పింది. ఖాతార్ ఎయివేస్ కు చెందిన QR579 విమానంలో సాంకేతిక సమస్యలు తలెత్తాయి. దీంతో విమానాన్ని పాకిస్థాన్ కరాచీ విమానాశ్రయానికి మళ్లించారు. ఈరోజు( మార్చి21) ఉదయం ఢిల్లీ నుంచి ఖాతార్ రాజధాని దోహాకు బయలుదేరిన విమానంలో కార్గో హెల్డ్ లో పొగలు వస్తుండటంతో అత్యవస ల్యాండింగ్ చేయాల్సి వచ్చింది. మార్గం మధ్యలో ఉన్న విమానాన్ని పాక్ లోని కరాచీ ఏయిర్ పోర్ట్ కు మళ్లించారు. దీంతో విమానం సురక్షితంగా ల్యాండ్ అయింది. విమానం ల్యాండింగ్ తరువాత ప్రయాణికులను సురక్షితంగా విమానం నుంచి కిందకు దించారు. ప్రమాద సమయంలో విమానంలో మొత్తం 100కు పైగా ప్రయాణికులు ఉన్నారు. ప్రస్తుతం సంఘటనకు కారణాలను ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. ప్రయాణికులను వేరే విమానంలో దోహా తరలించేందుకు ఖతార్ ఏయిర్ వేస్ మరో విమానాన్ని సిద్దం చేస్తున్నట్లు ఎయిర్ వేస్ ప్రతినిధులు వెల్లడించారు. ప్రయాణికులకు అసౌకర్యం కలిగించినందుకు ఖాతార్ ఏయిర్ వేస్ క్షమాపణ కోరింది.

 

 

Read more RELATED
Recommended to you

Latest news