ఫ్లిప్‌ కార్ట్ లో అదిరే ఆఫర్స్.. ఏకంగా 80 శాతం డిస్కౌంట్..!

-

ఆఫర్ లో కొనుగోలు చెయ్యాలనుకున్న వస్తువులని కొని డబ్బులు ఆదా చేసుకోవాలని చాలా మంది అనుకుంటూ వుంటారు. మీరు కూడా మీకు నచ్చిన వాటిని ఆఫర్ లో కొని.. మీ డబ్బులని ఆదా చేసుకోవాలని అనుకుంటే ఇదే మంచి సమయం. దిగ్గజ ఈకామర్స్ సంస్థల్లో ఒకటైన ఫ్లిప్‌ కార్ట్ భారీ డిస్కౌంట్ ఆఫర్ల తో కస్టమర్ల ముందుకు వస్తోంది. ఇక దీనికి సంబంధించి పూర్తి వివరాల లోకి వెళితే..

బిగ్ బిలియన్ డేస్ సేల్ 2021 తేదీలను ఫ్లిప్ కార్ట్ ప్రకటించింది. ఇక తేదీల గురించి చూస్తే.. ఈ సేల్ అక్టోబర్ 7 నుంచి 12 వరకు ఉంటుంది. ఫ్లిప్‌కార్ట్ ప్లస్ సభ్యులకు ముందునే సేల్ ప్రారంభమౌతుంది. ఇది ఇలా ఉండగా యాక్సిస్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు కలిగిన వారికి 10 శాతం తక్షణ డిస్కౌంట్ లభిస్తుంది గమనించండి.

అదే విధంగా పేటీఎం కస్టమర్లకు క్యాష్‌‌ బ్యాక్ కూడా వస్తుంది. నో కాస్ట్ ఈఎంఐ, ఎక్స్చేంజ్ ఆఫర్లు ఉంటాయి. రివార్డు పాయింట్లు వంటివి గెలుచుకోవచ్చు. ఇక ఆఫర్స్ విషయం లోకి వచ్చేస్తే.. ఈ బిగ్ బిలియన్ సేల్స్ లో ఎలక్ట్రానిక్స్ అండ్ యాక్ససిరీస్‌పై 80 శాతం వరకు తగ్గింపు ఉంటుంది, టాప్ సెల్లింగ్ టీవీలపై 70 శాతం వరకు, ఫ్రిజ్‌లపై 50 శాతం వరకు తగ్గింపు పొందొచ్చు. అలానే బ్యాగ్స్, డ్రస్‌లు వంటి వాటిపై కూడా 60 నుంచి 80 శాతం వరకు తగ్గింపు పొందొచ్చు. మీ డబ్బులని ఆదా చేసేయచ్చు.

Read more RELATED
Recommended to you

Exit mobile version