అక్టోబ‌ర్ 29 నుంచి ఫ్లిప్‌కార్ట్‌లో బిగ్ దివాలీ సేల్

ఈ-కామ‌ర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ మ‌రో సేల్‌కు సిద్ధ‌మ‌వుతోంది. తాజాగా అక్టోబ‌ర్ 16 నుంచి 21వ తేదీ వ‌ర‌కు అందులో బిగ్ బిలియ‌న్ డేస్ సేల్ జ‌రిగిన విష‌యం విదిత‌మే. అయితే అక్టోబ‌ర్ 29 నుంచి బిగ్ దివాలీ సేల్‌ను ఫ్లిప్‌కార్ట్ నిర్వ‌హించ‌నుంది. ఈ సేల్ న‌వంబ‌ర్ 4 వ‌ర‌కు కొన‌సాగ‌నుంది. ఆ సేల్‌లో కూడా వినియోగ‌దారుల‌కు అనేక ఆఫ‌ర్లు, డిస్కౌంట్లు ల‌భించ‌నున్నాయి. అలాగే బ్యాంక్ ఆఫ‌ర్లు, నో కాస్ట్ ఈఎంఐ స‌దుపాయం అందించ‌నున్నారు.

flipkart big diwali sale starts on october 29th

ఫ్లిప్‌కార్ట్ బిగ్ దివాలీ సేల్ ప్ల‌స్ మెంబ‌ర్ల‌కు ఒక రోజు ముందుగానే అందుబాటులోకి రానుంది. అయితే దీనిపై ఫ్లిప్‌కార్ట్ ఇంకా స్ప‌ష్ట‌త‌ను ఇవ్వ‌లేదు. ఇక సేల్‌లో యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్‌, డెబిట్ కార్డుల‌పై 10 శాతం ఇన్‌స్టంట్ డిస్కౌంట్ ఇవ్వ‌నున్నారు. సేల్‌లో గెలాక్సీ ఎఫ్‌41, గెలాక్సీ ఎస్20 ప్ల‌స్‌, గెలాక్సీ ఎ50ఎస్‌, పోకో ఎం2, ఎం2 ప్రొ, సి3, ఒప్పో రెనో 2ఎఫ్‌, ఒప్పో ఎ52, ఎఫ్‌15, రియ‌ల్‌మి నార్జో 20 సిరీస్ ఫోన్ల‌పై డిస్కౌంట్లు ల‌భిస్తాయి.

ఎల‌క్ట్రానిక్స్‌, యాక్స‌స‌రీలు, కెమెరాలు, ల్యాప్‌టాప్‌లు, స్మార్ట్ వాచ్‌లు, హెడ్‌ఫోన్స్ త‌దిత‌ర ప్రొడ‌క్ట్స్‌పై ఏకంగా 80 శాతం త‌గ్గింపు పొంద‌వ‌చ్చు. సేల్‌లో నిత్యం రాత్రి 12 గంట‌ల‌కు, ఉద‌యం 8 గంట‌ల‌కు, సాయంత్రం 4 గంట‌ల‌కు మొబైల్స్‌, టీవీల‌పై ప్ర‌త్యేక డీల్స్ ను అందుబాట‌లో ఉంచుతారు.