మాజీ కేంద్ర మంత్రికి షాక్.. మూడేళ్ళు జైలు శిక్ష

-

నేతలు, ప్రజాప్రతినిధుల మీద ఉన్న అవినీతి కేసులని ఏళ్ళ తరబడి తేల్చకుండా ఉన్న కేసుల్ని త్వరిత గతిన తేల్చాలని సుప్రీం కోర్ట్ ఆదేశించిన తరువాత ఇప్పుడు కోర్ట్ లు దూకుడుగా కేసులని తేల్చే పనిలో పడ్డాయి. తాజాగా ఒక కీలక నేత అయిన మాఈ కేంద్ర మంత్రికి 3 ఏళ్ళ జైలు శిక్ష విధించారు. 1999 లో జార్ఖండ్ బొగ్గు గనుల కేటాయింపులో అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న బొగ్గు కుంభకోణం కేసులో మాజీ కేంద్ర మంత్రి దిలీప్ రేకు ప్రత్యేక సిబిఐ ప్రత్యేక కోర్టు 3 సంవత్సరాల జైలు శిక్ష విధించింది.

ఈ కేసులో ఇటీవల దోషులుగా తేలిన ఇద్దరు మాజీ అధికారులు ప్రదీప్ కుమార్ బెనర్జీ, నిత్యానంద్ గౌతంలకి కూడా 3 సంవత్సరాల జైలు శిక్ష విధించింది. ఈ కేసులో దోషులకు శిక్షల ఖరారుపై అక్టోబరు 14న ఇరు వర్గాల వాదనలను విన్న ప్రత్యేక న్యాయస్థానం తాజాగా తీర్పు వెలువరించింది. ఝార్ఖండ్‌ గిరిదహ్ జిల్లా బ్రహ్మదిహ బొగ్గు గనులను నిబంధనలకు విరుద్దంగా క్యాస్ట్రన్ టెక్నాలజీకి కేటాయించినట్టు ఆరోపణలు రావడంతో సీబీఐ ఈ కేసు నమోదుచేసింది.

Read more RELATED
Recommended to you

Latest news