దర్శక ధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి కి ఉన్న సెంటిమెంట్స్ చాలానే. ఈ విషయం ఇండస్ట్రీలో వాళ్ళకి తెలిసినప్పటికి బయట జనాలకి మాత్రం తెలిసే అవకాశం లేదు. కానీ ఒక్క లాజిక్ గనక కరెక్ట్ గా గమనిస్తే కామన్ ఆడియన్స్ కి కూడా రాజమౌళి సెంటిమెంట్ గురించి అర్థమవుతుంది. అంతేకాదు అవాక్కవుతారు కూడా. ఈ దర్శక ధీరుడికి జూలై నెల ఎంతో సెంటిమెంట్. అదేంటి ఈ నెల సెంటిమెంట్ .. ఎలా అని ఆశ్చర్యపోతున్నారా ..ఆయన భారీ హిట్స్ అందుకున్న సినిమాలన్ని జూలై నెలలో రిలీజైనవే.
అందుకే ఆయన ఏ సినిమా చేసినా రిలీజ్ ఖచ్చితంగా జూలై నెలలో ఉండేలా ప్లాన్ చేసుకుంటారు. ఇది సాధారణ ప్రజలకి ఇప్పటి వరకు తెలిసుండకపోవచ్చు. గతంలో రాజమౌళి యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ తో తెరకెక్కించిన సింహాద్రి జూలైలోనే రిలీజ్ అయి సంచలనాన్ని సృష్ఠించింది. బాక్సాఫీస్ బద్దలయ్యో కలెక్షన్స్ ని సాధించింది. అంతేకాదు ఇండస్ట్రీ రికార్డ్స్ ని తిరగరాసిన మెగా పవర్ స్టార్ రాం చరణ్ తో రాజమౌళి తెరకెక్కించిన మగధీర కూడా జూలైలోనే విడుదలై అద్భుతమైన సక్సస్ ని సొంతం చేసుకుంది. ఇక రాజమౌళి హాలీవుడ్ తరహాలో సినిమాని తీసి ప్రయోగం చేసిన నాని ఈగ కూడా జులైలోనే రిలీజ్ బాక్సాఫీస్ కొత్త రికార్డ్ లను సృష్ఠించింది.
ఇక పాన్ ఇండియా మూవీగా రిలీజ్ అయిన ‘బాహుబలి: ది బిగినింగ్’ కూడా అదే నెలలో రిలీజయి తెలుగు సినిమా పేరు ప్రఖ్యాతులను ఆకాశం అంత ఎత్తులో నిలబెట్టింది. అందుకే రాజమౌళికి జూలై నెల అంటే ఎంతో ప్రత్యేకమైనది. అయితే ఈ సారి ఆ సెంటిమెంట్ ని రాజమౌళి వదిలేయాల్సి వచ్చింది. యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్, మెగా పవర్ స్టార్ రాం చరణ్ హీరోలుగా ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కుతున్న ఆర్.ఆర్.ఆర్ జూలై సెంటిమెంట్ ని కాదని సంక్రాతి బరిలో దిగబోతుంది.
దాంతో రాజమౌళి సెంటిమెంట్ గా బావించే జూలై నెల ని మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ క్యాష్ చేసుకోబుతున్నట్లు సమాచారం. వరుణ్ తేజ్ హీరోగా కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో తాజా చిత్రం తెరకెక్కబోతోంది. ఈ సినిమాకి ‘బాక్సర్’ అనే టైటిల్ ఫిక్స చేరని సమాచారం. వీలైనంత త్వరగా షూటింగ్ అండ్ పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు కంప్లీట్ చేసి జూలైలో నెలలో రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ సన్నాహాలు మొదలు పెట్టింది. ఇక జూలై నెలలో ఇప్పటి వరకు రిలీజ్ కి రెడీ అవుతున్న సినిమా ఇదొక్కటే కావడం విశేషం.