బిహార్‌ను వణికిస్తున్న వరదలు.. ప్రజల్లో రాజకీయ నాయకులపై ఆగ్రహానికి కారణమవుతున్నాయి. రాష్ట్రంలో నష్టాన్ని అంచనా వేసేందుకు వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన మహారాజ్‌గంజ్ ఎంపీ జనార్ధన్ సింగ్ సిగ్రివాల్‌కు ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది.సివాన్ జిల్లాల్లో పలు ప్రాంతాల్లో పర్యటించి.. లక్రి నాబిగబ్జ్కు వచ్చిన సిగ్రవాల్కు వ్యతిరేకంగా స్థానికులు ఆందోళనకు దిగారు. వారిలో కొంత మంది ఎంపీ సహా ఆయనతో పాటు వచ్చిన అధికారులపైకి కుర్చీలు విసిరారు.
చాలా మంది రాజకీయ నాయకులు తమ ప్రాంతాల్లో పర్యటించినా.. ఎవరూ సహాయం చేయలేదన్నది స్థానికుల ప్రధాన ఆరోపణ. కొంత మంది ఎంపీ సిగ్రివాల్‌ను కలిసి పరిస్థితి వివరించినా.. తమకు ఎలాంటి భరోసా ఇవ్వలేదని అంటున్నారు. ఈ కారణంగానే ఎంపీపై దాడికి దిగినట్లు తెలుస్తోంది.భారీ వరదల కారణంగా బిహార్‌లో ఇప్పటి వరకు 23 మంది మృతి చెందారు. 74 లక్షల మందిపై తీవ్ర ప్రభావం పడింది. రాష్ట్రంలోని 16 జిల్లాల్లో వరద ప్రభావం తీవ్రంగా ఉంది.