టీఆర్ ఎస్ లో ఈటలకు ఎంత పట్టుందో.. అటు ప్రభుత్వంలోనూ అంతే పట్టుంది. ఐఏఎస్ ల దగ్గరి నుంచి ఐపీఎల్ ల దాకా చాలా మంది ఆయనకు సన్నిహితంగా ఉన్నారు. దీంతో వారిపై వేటు వేసేందుకు కేసీఆర్ టీం శరవేగంగా పావులు కదుపుతోంది. ఇందుకోసం ఇప్పటికే పలువురిని టార్గెట్ చేసింది.
ఈటల కోటరీలో భాగంగా హుజూరాబాద్ ఏసీపీని బదిలీ చేయగా.. ఇప్పుడు మరో ఏసీపీపై బదిలీ వేటు పడింది. ఈటలతో పెద్దపల్లికి చెందిన ఓ కీలక నేత సన్నిహితంగా ఉంటున్నాడన్న అనుమానంతో.. పార్టీ అధిష్టానం ఆ నేతపై దృష్టి పెట్టింది. నిత్యం ఫోన్ లో టచ్ లో ఉంటూ ఎదురుతిరగకుండా చూసుకుంటోంది. ఇందోలో భాగంగా పెద్దపల్లి ఏసీపీని బదిలీ చేసింది.
దీంతో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఒక్కసారిగా రాజకీయ ప్రకంపనలు మొదలయ్యాయి. వరుసగా ఈటలతో సన్నిహితం ఉన్న అధికారులను ఈటలకు దూరం చేస్తోంది అధిష్టానం. ఇక ఈటల వియ్యంకుడైన వెంకటరామిరెడ్డి ఇప్పుడు సెరికల్చర్ డైరెక్టర్ గా ఉన్నారు. త్వరలనే ఆయనపై కూడా వేటు పడే అవకాశం ఉంది. అంతే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా పలు డిపార్టెమెంట్లలో ఉన్న ఈటల వర్గీయులను తొలగించడమో.. లేక తమవైపు తిప్పుకునే ప్రయత్నమో చేయాలని చూస్తోంది టీఆర్ ఎస్ అధిష్టానం.