ఏపీ ప్రభుత్వం అన్యాయంగా వైసీపీ నేతలపై తప్పుడు కేసులు పెట్టించి అరెస్టులు చేయిస్తోందని, వాటిపై కాకుండా ప్రజాసమస్యలపై దృష్టి పెట్టాలని వైసీపీ కీలక నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు విమర్శించారు. గతంలో వైఎస్సార్‌సీపీ అధికారంలో ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీలపై జరిగిన దాడులపై రాష్ట్రవ్యాప్తంగా ఉన్న జిల్లా పోలీస్ స్టేషన్లకు ఫిర్యాదులు అందాయి.
ప్రస్తుతం వాటిని పోలీసు శాఖ తిరగదోడి టీడీపీ నేతలు, మహిళలపై చేసిన దాడులు, దూషణలపై కేసులు నమోదు చేసి వారిని అరెస్టు చేస్తోంది. ఈ క్రమంలోనే అంబటి రాంబాబు స్పందిస్తూ అరెస్టులపై కాకుండా ప్రజల సమస్యలపై ఫోకస్ చేయాలని సూచించారు. ఓ బాలుడిపై కుక్కలు దాడి చేసి చంపడం ఏపీ సంచలనం సృష్టించగా.. ‘వాడి మీద కేసు పెడతాం. వీళ్లను బొక్కలో వేద్దాం’ మొత్తాన్ని చితక్కొడతాం’ అని కాకుండా ఇలాంటి ఘోరాల మీద దృష్టి పెట్టండి అంటూ అంబటి కామెంట్స్ చేశారు.