సాధారణంగా జిడ్డు చర్మం ఉన్నప్పుడు దాని మీద దుమ్ము, ధూళి వంటివి పాడడం వలన ఈ సమస్య వస్తుంది. యాక్నీ సమస్య నుండి బయట పడడానికి కీర దోస బాగా ఉపయోగపడుతుంది. అయితే కీరదోస, యాక్నీ సమస్యని ఎలా తొలగిస్తుంది..?, ఈ సమస్య నుంచి మీరు ఎలా బయటపడొచ్చు..? అనే విషయాలు నిపుణులు చెప్పారు. మరి ఆలస్యమెందుకు వాటి కోసం ఇప్పుడే చూసేయండి.
కీరదోస లో మంచి పోషక పదార్థాలు ఉంటాయి. యాంటీ ఆక్సిడెంట్స్, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు, విటమిన్స్ ఉంటాయి. ఇది యాక్నీ సమస్యని తొలగించడానికి ఎంతో బాగా ఉపయోగపడుతుంది.
కీర దోసని ఎలా ఉపయోగించాలి..?
కీరదోసని పేస్ట్ కింద చేసుకుని దానిని ముఖంపై అప్లై చేసుకోవడం వల్ల మంచి ఫలితం కనబడుతుంది.
దీని కోసం మీరు ఒక కీరదోసని మెత్తగా పేస్ట్ చేసి దానిలో కొద్దిగా పెరుగు వేసి, ఒక టీ స్పూన్ తేనె కూడా వేసి బాగా మిక్స్ చేసి ఫేస్ మీద మాస్క్ లాగ వేసుకోండి. అది అయిపోయిన తర్వాత చల్లటి నీళ్ళతో ముఖాన్ని శుభ్రంగా కడిగేసుకోండి. దీనితో మీకు యాక్నీ సమస్య తొలగిపోతుంది.
పింపుల్స్ తగ్గాలంటే ఈ విధంగా అనుసరించండి:
చాలా మంది మొటిమలు సమస్యతో బాధపడుతుంటారు. అటువంటి వాళ్ళు కీర దోసని ఈ విధంగా ఉపయోగించడం వల్ల మంచి ఫలితం కనబడుతుంది.
దీని కోసం మీరు కొద్దిగా కీర దోస జ్యూస్ కింద చేసుకుని దానిలో కలబంద గుజ్జు వేసి బాగా మిక్స్ చేసి కొన్ని చుక్కలు టీ ట్రీ ఆయిల్ కూడా వేసి ముఖం మీద అప్లై చేసుకొని 15 నిమిషాలు నుండి 20 నిమిషాలు ఉంచి తర్వాత ముఖాన్ని కడిగేసుకోండి. ఈ విధంగా చేయడం వల్ల పింపుల్స్ దూరం అయిపోతాయి.