ఏపీ సీఎస్ ఆదిత్యనాధ్ దాస్ పదవీ కాలం పొడిగింపు

-

అమరావతి : కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీ సీఎస్ గా ఆదిత్యనాధ్ దాస్ పదవీ కాలం మరో మూడు నెలలు పొడగిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది కేంద్ర ప్రభుత్వం. ఈనెల 30 తో ఏపీ సిఎస్ గా ఆదిత్యనాద్ దాస్ పదవీ కాలం ముగియనుంది. అయితే కేంద్ర ప్రభుత్వం తాజా ఉత్తర్వులతో…. సెప్టెంబరు 30 వరకూ సీఎస్ గా కొనసాగనున్నారు ఆదిత్యనాధ్ దాస్. అయితే ఏపీ సీఎస్ ఆదిత్యనాథ్ దాస్ పదవీకాలాన్ని పొడగించాలని ఇప్పటికే కేంద్రానికి జగన్ సర్కార్ లేఖ రాసింది.

ఈ నేపథ్యంలోనే సీఎస్ ఆదిత్యనాథ్ పదవీ కాలాన్ని మరో మూడు నెలలు పొడగిస్తూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. కాగా నిన్నటి వరకు ఆదిత్యనాథ్ దాస్ ను తప్పించి… ఏపీ సీఎస్ గా మరో వ్యక్తిని తీసుకు వస్తున్నారని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. సీనియర్ ఐఏఎస్ అధికారి సమీర్ శర్మను ఏపీ సీఎస్ గా బదిలీ చేస్తారని అందరూ అనుకున్నారు. కాని చివరికి ఆదిత్యనాధ్ దాస్ పదవీ కాలం మరో మూడు నెలలు పొడగించింది కేంద్రం.

Read more RELATED
Recommended to you

Exit mobile version