జుట్టు ఒత్తుగా ఎదగాలంటే ఈ చిట్కాలు పాటించండి…!

-

సాధారణంగా చాలా మంది జుట్టు రాలిపోతోందని బాధపడుతూ ఉంటారు. ముఖ్యంగా స్త్రీలు జుట్టు రాలిపోయే సమస్యని ఎదుర్కొంటారు. దాని కోసం అనేక రకాల షాంపూస్ వంటి వాటిని ట్రై చేస్తూ ఉంటారు. అయితే వాటి కంటే కూడా ఇక్కడ ఉత్తమమైన కొన్ని పదార్ధాలు ఉన్నాయి వాటిని మీ డైట్ లో చేర్చుకుంటే ఆ సమస్య నుంచి త్వరగా బయటపడవచ్చు. ఇలా చేయడం వల్ల మీ జుట్టు పెరుగుతుంది. అలానే సిల్కీగా, షైనింగ్ గా ఉంటుంది. మరి ఎటువంటి ఆలస్యం లేకుండా ఆ ఆహార పదార్థాల గురించి చూసేయండి.

పాలకూర:

పాలకూర ఆరోగ్యానికి చాలా మంచిది. జుట్టు రాలిపోవడానికి ప్రధానమైన కారణం మినరల్స్ లేకపోవడం. అయితే తోటకూర మీ డైట్ లో తీసుకోవడం వల్ల మినరల్స్ మరియు ఫోలేట్, ఐరన్, విటమిన్ ఏ తో పాటు విటమిన్ సి కూడా మీకు అందుతుంది. ఇవన్నీ కూడా జుట్టు ఎదుగుదలకు కారణమవుతాయి. కాబట్టి ప్రతి రోజూ మీ డైట్ లో దీనిని తీసుకోండి. దీనివల్ల జుట్టు ఎదగడానికి మాత్రమే కాకుండా ఆరోగ్యంగా, మెరుస్తూ ఉంటుంది.

సోయా బీన్స్:

సోయాబీన్స్ ని సూపర్ ఆరోగ్యకరమైన ఆహారం అని చెప్పవచ్చు. దీనిలో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. ఐరన్ తక్కువగా ఉన్న మహిళలు సోయాబీన్స్ తీసుకోవడం వల్ల చాలా మంచి కలుగుతుంది. ఇది ఆరోగ్యంగా ఉంచుతుంది మరియు హృదయ సంబంధిత సమస్యలు కూడా తొలగిస్తుంది. దీనిని తీసుకోవడం వల్ల జుట్టు కూడా ఆరోగ్యంగా ఉంటుంది.

నట్స్:

ప్రతి రోజూ నట్స్ ను తీసుకోవడం చాలా మంచిది. ప్రతి ఒక్కరూ ప్రతి రోజూ తీసుకోవడం అలవాటు చేసుకోవాలి. దీనిలో విటమిన్ ఇ పుష్కలంగా ఉంటుంది కాబట్టి ప్రతి రోజూ వీటిని తీసుకోవడం వల్ల మీ జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది.

గుడ్లు:

గుడ్లు లో బయోటిన్ ఎక్కువగా ఉంటుంది అది జుట్టు పెరుగుదలకు కారణం అవుతుంది. కాబట్టి దీనిని కూడా మీ డైట్ లో తప్పక తీసుకోవడం మంచిది.

Read more RELATED
Recommended to you

Latest news